నాగాలాండ్‌ అసెంబ్లీలో జ‌న‌గ‌ణ‌మ‌న ఆలాపన..రాష్ట్రం ఏర్పడిన 58 ఏళ్ల తరువాత తొలిసారి అరుదైన దృశ్యం..!!

నాగాలాండ్‌ అసెంబ్లీలో జ‌న‌గ‌ణ‌మ‌న ఆలాపన..రాష్ట్రం ఏర్పడిన 58 ఏళ్ల తరువాత తొలిసారి అరుదైన దృశ్యం..!!

58 years after Jana gana mana song in Nagaland Assembly :  నాగాలాండ్ అసెంబ్లీలో అరుదైన దృశ్యం ఆవిష్కరించబడింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక..నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడిన 58 ఏళ్ల తరువాత అసెంబ్లీలో భారతదేశపు జాతీయ గీతం ‘జ‌న‌గ‌ణ‌మ‌న’ను ఆలపించిన అరుదైన ఘటన జరిగింది. చ‌రిత్ర‌లో తొలిసారి నాగాలాండ్ అసెంబ్లీలో జ‌న‌గ‌ణ‌మ‌న ప్ర‌తిధ్వ‌నించటం విశేషం.

జాతీయ గీతం జ‌న‌గ‌ణ‌మ‌నను అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ముక్త కంఠంతో ఆల‌పించిన అరుదైన ఘటన ఫిబ్రవరి 12న జరిగింది. నాగాలాండ్ రాష్ట్రం ఏర్ప‌డిన 58 ఏళ్ల త‌ర్వాత ఈ అరుదైన దృశ్యం చోటుచేసుకోవ‌డం అద్భుతమని చెప్పొచ్చు. ఫిబ్రవరి 12న అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌వి అసెంబ్లీని ఉద్దేశిస్తూ ప్ర‌సంగించారు. ఆ ప్ర‌సంగానికి ముందు నాగాలాండ్ అసెంబ్లీలో తొలిసారి జాతీయ గీతాన్ని ఆల‌పించారు.

1963లో ఏర్పడిన నాగాలాండ్ రాష్ట్రం..
స్వాతంత్ర్యం వచ్చాక ఈ అఖండ భారత దేశాలుగా విడిపోయింది. అనంతరం భారత్ లో పలు రాష్ట్రాలు విభజించబడ్డాయి. అలా ఇప్పటి వరకూ 29 రాష్ట్రాలు 9 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడింది. దీంట్లో భాగంగా నాగాలాండ్ రాష్ట్రం 1963, డిసెంబ‌ర్ 1 ఏర్ప‌డింది.

కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా అసెంబ్లీలో జాతీయ గీతాన్ని ఎవ‌రూ ఆల‌పించ‌లేదు. దీనికి కారణాలు ఏమైనాగానీ తాజాగా మొదలైన అసెంబ్లీ స‌మావేశాల్లో జ‌న‌గ‌ణ‌మ‌ణ గీతం మారు మ్రోగింది. దానికి సంబంధించిన వీడియోను సెక్యూర్టీ అన‌లిస్ట్ నితిన్ ఏ గోఖ‌లే త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ఇదొక అత్యంత అరుదైన దృశ్య‌మంటూ నితిన్ గోఖలే తన ట్వీట్‌లో వెల్లడించారు.

కొత్త సంప్ర‌దాయానికి తెర తీసిన నాగాలాండ్..
భార‌త దేశానికి 1947లో స్వాతంత్య్రం వ‌చ్చిన విషయం తెలిసిందే. ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితంగా వచ్చింది స్వాతంత్ర్యం. ఆ స‌మ‌యంలో అస్సాం ప్రావిన్సులో నాగాలాండ్ ఉంది. అప్ప‌ట్లో అక్క‌డ తిరుగుబాటు ఎక్కువ‌గా ఉండేది.

1950 ద‌శ‌కంలో విభిన్న‌ తెగ‌ల మ‌ధ్య సంక్షోభం నెలకొని ఉండేది. ఆ హింస వ‌ల్ల ఆ ప్రాంతం అభివృద్ధి కుంటుప‌డింది. అభివృద్ధి అనేదే జరగలేదు. కానీ డిసెంబ‌ర్ 1,1963లో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి.. కోహిమా ప‌ట్ట‌ణాన్నిరాజ‌ధానిగా చేశారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత మొదటిసారి 1964లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయి. షీలూ ఆవ్ నాగాలాండ్ కు మొదటి సీఎం అయ్యారు.

అనంతరం 1964, ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన నాగాలాండ్ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అసెంబ్లీలో ఎందుకు జాతీయ గీతాన్ని ఆల‌పించ‌లేదో అనేది పెద్ద ప్రశ్నే అని చెప్పారు. ఈ విషయం గురించి తెలియ‌ద‌ని..ఎందుకు జాతీయ గీతాన్ని ఆల‌పించ‌లేదో అసెంబ్లీ క‌మీష‌న‌ర్, కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ పీజే ఆంథోనీ తెలిపారు.

కానీ ప్ర‌స్తుతం ప్ర‌వేశ‌పెట్టిన కొత్త సాంప్ర‌దాయాన్ని అసెంబ్లీ స‌భ్యులు మనస్ఫూర్తిగా స్వాగ‌తించారని తెలిపారు. నిజానికి ఈశాన్య రాష్ట్రాలైన నాగాల్యాండ్‌, మ‌ణిపూర్‌, మిజోరంలో ఎక్కువ శాతం హిందీ భాష రానివారే ఉన్నారు. ఆ రాష్ట్రాల్లో ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది క్రిస్టియ‌న్లే ఉంటారు.

నాగాలాండ్ రాష్ట్రంలో ఏడు జిల్లాలున్నాయి. రాష్ట్ర జనాభాలో దాదాపు 84 శాతము ప్రజలు 16 నాగా తెగలకు చెందినవారే. నాగాలు ఇండో-మంగోలాయిడ్ జాతికి చెందిన వారు. ఇంకా..చిన్ ప్రజలు 40,000 దాకా ఉన్నారు. వీరితోపాటూ 220,000 అస్సామీలు, 14,000 బెంగాళీ ముస్లింలు ఉన్నారు. జనాభాలో 85% పైగా క్రైస్తవ మతస్థులు ముఖ్యముగా బాప్టిస్టులే కావటం గమనించాల్సిన విషయం..

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Pl see the video below. At first glance, perfectly normal scene, right? But you will be amazed, like I was, to know that this was for the first time that the National Anthem was played in the Nagaland Assembly. Just for the record, Nagaland became a State on 1 December 1963 <a href=”https://t.co/70s6Q20d1N”>pic.twitter.com/70s6Q20d1N</a></p>&mdash; Nitin A. Gokhale (@nitingokhale) <a href=”https://twitter.com/nitingokhale/status/1362672513994485760?ref_src=twsrc%5Etfw”>February 19, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>