అమెరికాకు యానిమేటెడ్ వీడియోలో చైనా ఎంబస్సీ కౌంటర్

  • Published By: Subhan ,Published On : May 1, 2020 / 04:27 AM IST
అమెరికాకు యానిమేటెడ్ వీడియోలో చైనా ఎంబస్సీ కౌంటర్

ఫ్రాన్స్ నుంచి చైనీస్ ఎంబస్సీ యునైటెడ్ స్టేట్స్ కు కౌంటర్ విసురుతూ ఓ యానిమేటెడ్ వీడియో రిలీజ్ చేసింది. “Once Upon a Virus” అనే పేరుతో ఒక నిమిషం 38 సెకన్ల పాటు ఉన్న వీడియోలో అమెరికాకు ముందస్తు సూచనలు ఇచ్చినప్పటికీ పట్టించులేదన్నట్లు చెప్పింది. ఆ తర్వాత చైనా కావాలనే ఇదంతా చేసింది. తప్పుడు డేటా ఇచ్చింది. WHO(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ముందుగా సూచించలేదు. (అందరి చూపు మే 03 : ఇటలీ తరహాలో లాక్ డౌన్ ఎత్తివేత)

లేదంటే జాగ్రత్త పడేవాళ్లం అందుకే నిధులు కట్ చేస్తున్నామని చైనాను ఆడిపోసుకుంటున్నట్లుగా ఉంది. అమెరికా తరపున స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మాట్లాడుతుంటే.. చైనా ప్రభుత్వం ఆర్మీ రూపంలో కరోనా వైరస్ గురించి సూచనలు ఇస్తుంటుంది. ఇదిగో ఆ సంభాషణ ఇలా ఉంది. 

చైనా: WHOకు ఇదే మా విన్నపం. వింతైన న్యూమోనియా కేసులు నమోదవుతున్నాయి.
అమెరికా: ఆ విన్నాం లే. 

చైనా: అదొక కొత్త వైరస్.
అమెరికా: అయితే ఏంటి?

చైనా: టెంపరరీ హాస్పిటల్స్ పేరుతో కాన్సట్రేషన్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను పర్యవేక్షిస్తున్నాం.
అమెరికా: ఇదొక క్రూరమైన చర్య. మానవ హక్కులకు భంగం కలిగిస్తున్నారు. 

కాసేపటి తర్వాత.. 
చైనా: మెడికల్ సిస్టమ్ ను నోవల్ కరోనా వైరస్ దెబ్బతీస్తుంది.
అమెరికా: చైనా ఎంత వెనుకబడి ఉందో చూశారా..

చైనా: ఈ వైరస్ డాక్టర్లను కూడా చంపేస్తుంది. 
అమెరికా: మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్నారు. 

చైనా: ఇది గాల్లో కూడా వ్యాప్తి చెందుతుంది. 
అమెరికా: ఏప్రిల్ నాటికి పూర్తిగా నశిస్తుందనే నమ్మకముంది. 

ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఫిబ్రవరిలో మాట్లాడుతూ.. ఏప్రిల్ నాటికి కొవిడ్-19 పూర్తిగా దూరం అవుతుందని చెప్పిన సంగతినే ప్రస్తావించారు. 

ఆ వీడియో కంక్లూజన్‌లో అమెరికా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ను నిందిస్తూ.. మూడు నెలలుగా చేసిందేమీ లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా మాట వింటుంది. మిలియన్ల కొద్ది చైనీయులు చనిపోతుంటే ఈ వైరస్ ప్రమాదకరం కాదని చెప్పిన అమెరికా మాటే WHO చెప్పినా చైనానే నిందిస్తున్నారు. అని వీడియోలో కంక్లూజ్ చేసింది.