RRB-NTPC result Row: విద్యార్థులను కొట్టిన ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్‌!

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (RRB-NTPC) పరీక్ష 2021 ఫలితాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారగా రోడ్డెక్కారు.

RRB-NTPC result Row: విద్యార్థులను కొట్టిన ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్‌!

Rrb Ntpc Result, Six Policemen, Suspension, Beating Students, Prayagraj, Case Registered, Coaching Centers, Patna

RRB-NTPC result Row: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (RRB-NTPC) పరీక్ష 2021 ఫలితాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారగా రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. దేశమంతా ఒక్కసారిగా ఈ విషయమై అట్టుడికిపోయింది. అభ్యర్థులను కట్టడిచేయటానికి పోలీసులు లాఠీచార్జీలు, టియర్‌గ్యాస్‌లను ప్రయోగించారు.

ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న ఈ రిజల్ట్స్‌ను లేటెస్ట్‌గా విడుదల చేయగా.. ఈ ఫలితాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. నలంద, నవాడ, సీతామర్హి, బక్సర్‌, అర్రా, ముజఫర్‌పూర్‌లలో అభ్యర్థులు రైల్వే ట్రాక్‌లపై బైటాయించారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రెండు మూడు రోజులుగా ఆందోళనకారులు రైళ్లను ధ్వంసం చేయడంతోపాటు రైళ్లపైకి రాళ్లు రువ్వుతున్నారు. లేటెస్ట్‌గా బీహార్‌లోని గయా జంక్షన్‌లో భభువా-పట్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ని తగలబెట్టారు పోలీసులు. దీంతో రైలులోని పలు బోగీలు దగ్దమయ్యాయి. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి.

Shastri On Dhoni: “ధోని ఫోన్ నంబర్ నా దగ్గర లేదు..” ఆశ్చర్యకర విషయాలు చెప్పిన రవిశాస్త్రి

ఇదిలా ఉంటే రైల్వే పరీక్షకు సంబంధించి ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఆందోళన సమయంలో విద్యార్థులను కొట్టినందుకు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు అధికారులు. అయితే, ఈ ఘటనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఎస్‌ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో విద్యార్థులను ప్రేరేపించినందుకు ఖాన్ సర్‌తో సహా పాట్నాలోని చాలా కోచింగ్ సెంటర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Puneeth Rajkumar : పునీత్ చివరి చిత్రం.. కన్నడ డిస్ట్రిబ్యూటర్ల గొప్ప నిర్ణయం..

సస్పెన్షన్‌కు గురైన ఆరుగురు పోలీసు సిబ్బందిలో ఒక ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరంతా అనవసరంగా విద్యార్ధులను కొట్టారని ఆరోపిస్తున్నారు. జనవరి 24వ తేదీన, రైల్వేస్ NTPC పరీక్ష ఫలితాలపై జరిగిన నిరసన జరగ్గా.. పాట్నాలో విద్యార్థులపై లాఠీచార్జికి వ్యతిరేకంగా ప్రయాగ్‌రాజ్ విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు.