Varun Gandhi: దేశంలో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీ: వరుణ్ గాంధీ

సొంతపార్టీ నిర్ణయాలపైన కూడా విమర్శలు చేసేందుకు వెనుకాడని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళం విప్పారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. మొత్తం 60 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారు.

Varun Gandhi: దేశంలో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీ: వరుణ్ గాంధీ

Varun Gandhi

Varun Gandhi: సొంతపార్టీ నిర్ణయాలపైన కూడా విమర్శలు చేసేందుకు వెనుకాడని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళం విప్పారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. మొత్తం 60 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారు. శనివారం వరుణ్ గాంధీ నిరుద్యోగం అంశంపై స్పందించారు. ‘‘గతంలో ఎప్పుడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. అనేక విభాగాల్లో ఖాళీలున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్రాల్లో మొత్తం కలిపి దాదాపు 60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయం గణాంకాలే చెబుతున్నాయి. ఉద్యోగాల భర్తీ జరగకపోవడంతో దేశంలోని కోట్లాది యువత నిరాశ, నిస్పృహలో ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారు.

church stampede: చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి

నిరుద్యోగ చార్ట్‌కు సంబంధించిన ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని పిలిబిత్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున వరుణ్ గాంధీ ఎంపీగా కొనసాగుతున్నారు. బీజేపీ ఎంపీ అయినప్పటికీ, ప్రజా సమస్యలపై తన గళం వినిపించడంలో ఎప్పుడూ ముందుంటారు. అవసరమైతే సొంత ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కూడా మాట్లాడుతారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రైతు చట్టాలకు వ్యతిరేకంగా స్పందిచారు. ఉద్యమం చేసిన రైతులకు మద్దతు ప్రకటించారు. మరోవైపు మూడు సార్లు ఎంపీగా గెలిచినప్పటికీ, తన సొంత పార్టీ బీజేపీకి ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవలి ఎన్నికల్లో ప్రచారం చేయకపోవడం విశేషం.