లాక్ డౌన్ 3.0 ప్రకటన తర్వాత…ట్వీట్ చేసిన మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : May 2, 2020 / 06:19 AM IST
లాక్ డౌన్ 3.0 ప్రకటన తర్వాత…ట్వీట్ చేసిన మోడీ

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ ను మరో రెండు వారాలు(మే-17,2020వరకు)పొడిగిస్తున్నట్లు శుక్రవారం కేంద్రహోంమంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కార్యకలాపాలకు సంబంధించి అనేక రకాల మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 

మరోవైపు, ఇవాళ(మే-2,2020)ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతిని ఉద్దేశించి మరోసారి ప్రసంగిస్తారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఓ ట్వీట్ చేశారు. మంచి మిత్రుడైన థాయ్‌ ల్యాండ్ ప్రధాని ప్రయుత్ చాన్-ఓ-చా తో కోవిడ్-19 మహమ్మారికి సంబంధించి అనేక అంశాలపై చర్చించినట్లు మోడీ తెలిపారు.

మహమ్మారి విసురుతున్న సవాళ్లను… చారిత్రిక, సాంస్కృత్రిక సంబంధాలున్న పొరుగుదేశాలుగా ఇండియా-థాయ్ ల్యాండ్ లు కలసికట్టుగా ఎదుర్కొంటాయన్నారు. కరోనా కట్టడికి ఇరు దేశాలు కలసి పనిచేస్తాయని మోడీ తెలిపారు.

Also Read | మే 4 నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నిత్యావసరేతర వస్తువులు డెలివరీ