హైదరాబాద్‌లో విషాదం, కరోనా సోకిందనే భయంతో ఆత్మహత్య

  • Published By: srihari ,Published On : May 2, 2020 / 07:52 AM IST
హైదరాబాద్‌లో విషాదం, కరోనా సోకిందనే భయంతో ఆత్మహత్య

హైదరాబాద్ రామంతాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. కరోనా భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న 60 ఏళ్ల వ్యక్తికి తరచు ఆయాసం రావడంతో కరోనా సోకిందేమోనని ఆందోళన చెందాడు. కుటుంబ సభ్యులు కింగ్ కోఠి ఆసుపత్రికి తీసుకెళ్లగా..కరోనా లక్షణాలు లేవని వైద్యులు తేల్చారు. అయినప్పటికీ ఆందోళన చెందేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవాళ(మే 2,2020) ఉదయం వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి వెళ్దామని సిద్ధమవుతున్న తరుణంలో అపార్ట్ మెంట్ పైనుంచి కిందకు దూకాడు. దీంతో తలపగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కరోనా సోకిందేమోననే అనుమానంతో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కరోనా సోకినా భయపడాల్సిన పని లేదని డాక్టర్లు చెబుతున్నారు. మనో ధైర్యంతో కరోనాపై విజయం సాధించొచ్చని భరోసా ఇస్తున్నారు. మేమిచ్చే ట్రీట్ మెంట్ కన్నా మీ మనోధైర్యం చాలా ముఖ్యం అని, కరోనా నుంచి కోలుకోవడానికి అది చాలా అవసరం అని వైద్యులు చెబుతున్నారు.(వనస్థలిపురంలో విషాదం.. కరోనాతో తండ్రీకొడుకు మృతి)

భయం మనిషిని సగం చంపేస్తుందని అన్నారు. కరోనాకు సంబంధించి ఏవైనా అనుమానాలు ఉంటే డాక్టర్లను, అధికారులను అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేసింది. అయినా కొందరు వ్యక్తులు భయంతో ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళనకు గురి చేస్తోంది.