27ఏళ్ల ఏజ్ గ్యాప్.. బేబీ ఫేస్‌తో భార్య.. కిడ్నాప్ చేశాడని భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు 

  • Published By: srihari ,Published On : May 2, 2020 / 09:12 AM IST
27ఏళ్ల ఏజ్ గ్యాప్.. బేబీ ఫేస్‌తో భార్య.. కిడ్నాప్ చేశాడని భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు 

సాధారణంగా భార్యభర్తల మధ్య వయస్సులో చాలా తేడా ఉంటుంది. కొంతమందికి ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం సహజమే. అలాగే భర్త కంటే భార్య వయస్సు చాలా తక్కువగా ఉండటం కూడా కామన్. అదే ఏజ్ గ్యాప్.. ఇప్పుడు ఓ జంటకు చిక్కులు తెచ్చిపెట్టింది. భార్య చూడటానికి అచ్చం చిన్నపిల్ల ముఖంతో ఉండటంతో పొరపాటున పోలీసులు భర్తను కిడ్నాపర్ అంటూ అరెస్ట్ చేశారు. చిన్న పిల్లను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తున్నడంటూ ఎవరో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన అమెరికాలోని Baltimore ప్రాంతంలో జరిగింది. 
age couple

Eddie అనే వ్యక్తికి 49 ఏళ్లు ఉంటాయి.. అతడి భార్య Toriకి 22 ఏళ్లు మాత్రమే.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 27ఏళ్ల వరకు ఉంటుంది. ఓ రోజున ఇద్దరూ కలిసి కారులో బయటకు వెళ్లారు. మధ్యలో పోలీసులు కారును ఆపేసి ఎడ్డీని బయటకు లాగారు. చిన్న పిల్లను కిడ్నాప్ చేశావంటూ పోలీసులు Eddieకి షాక్ ఇచ్చారు. కారులో డ్రైవర్ సీటులో భర్త కూర్చొంటే.. ప్యాసింజర్ వెనుక సీటులో భార్య టోరీ కూర్చొంది. పోలీసుల చర్యతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. కానీ, ఎడ్డీ తన భర్త అంటూ టోరీ పోలీసులకు వివరించే ప్రయత్నం చేసింది. తాను భర్త కంటే చాలా చిన్న వయస్సు ఉన్న బాలికలా కనిపిస్తానని చెప్పకొచ్చింది. 
age group couple

అప్పటికీ పోలీసులు నమ్మలేదు. మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి అని ప్రశ్నించారు. ఆయన తన భర్త అంటూ బదులిచ్చింది. దాంతో పోలీసులు తన ఐడీ ప్రూఫ్ అడిగారు. అది చూసిన పోలీసులు అవాక్కయ్యారు. పొరపాటుకు క్షమించండంటూ పోలీసులు అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయారు. అంతకుముందు టోరీ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించింది. కొన్ని వారాల క్రితం తాను ఓ ట్రక్ కోసం ఎదురుచూస్తుండగా.. బాత్ రూంకు వెళ్లినట్టు తెలిపింది. అక్కడి కొందరు తనను చూసి 13ఏళ్ల బాలికలా ఉన్నావని ఆశ్చర్యపోయారని మిర్రర్ యూకేతో తెలిపింది. (లాక్ డౌన్‌లోనూ ఆగని అత్యాచారాలు, యువతిపై గ్యాంగ్‌రేప్, నిందితుల్లో ముగ్గురు మైనర్లు)