30కోట్ల మొక్కలు లక్ష్యం, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 6వ విడత హరితహారం

హరిత హారం.. ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. గురువారం(జూన్

30కోట్ల మొక్కలు లక్ష్యం, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 6వ విడత హరితహారం

హరిత హారం.. ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. గురువారం(జూన్

హరిత హారం.. ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. గురువారం(జూన్ 25,2020) 6వ విడత హరితహారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ మెద‌క్ జిల్లా న‌ర్సాపూర్ లో మొక్కలు నాటి హరిహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక అర్బన్‌ పార్కులో సీఎం మొక్కలు నాటారు. ఇక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు ఆయా జిల్లాల్లో మొక్కలు నాటారు. హరిత తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా అందరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా చేపట్టి విరివిగా మొక్కలు నాటి రేపటి తరానికి స్వచ్ఛమైన గాలిని అందించాలని పిలుపునిచ్చారు.

ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే 110 ఎకరాల హెచ్ఎండీఏ భూమిలో ఆరున్నల లక్షల మొక్కల పెంపకం:
హైదరాబాద్ బల్కంపేట స్మశాన వాటికలో మంత్రి కేటీఆర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 9వ వార్డు ఎన్టీఆర్ కాలనీలోని పార్కు దగ్గర మంత్రి జగదీష్ రెడ్డి మొక్కలు నాటారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మలోతు కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మొక్కలు నాటి నీళ్లు పోశారు. భావితరాల భవిష్యత్తు కోసం, సీఎం కేసీఆర్‌ ఆకాంక్షకు అనుగుణంగా హరితహారం కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా దుండిగల్ లో మొక్కలు నాటారు కేటీఆర్. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న 110 ఎకరాల హెచ్ఎండీఏ భూమిలో చిట్టడివిలా యాదాద్రి మోడల్ లో ఆరున్నర లక్షల మొక్కలు పెంచబోతున్నామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం పచ్చదనంతో కళకళలాడేలా చర్యలు చేపడుతున్నామన్నారు.

ప్రతి ఇంటికి ఉచితంగా 6 మొక్కలు:
ఐదు విడుతల్లో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని జాతీయ‌, రాష్ట్ర ర‌హ‌దారుల వెంబడి నిరంతరాయంగా చెట్ల పెంప‌కం చేపట్టాలని ముఖ్య‌మంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ర‌హ‌దారుల వెంట ప్ర‌తి 30 కిలోమీట‌ర్ల దూరానికి ఒక న‌ర్స‌రీని ఏర్పాటు చేయాల‌ని అధికారులకు సూచించారు. అలాగే ఈసారి హెచ్ఎండీఏ పరిధిలో 5 కోట్ల మొక్కలు.. జీహెచ్ఎంసీ పరిధిలో 2.5 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించారు. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని హరితహారం కోసం 12,500 నర్సరీల్లో మొక్కలు రెడీగా ఉన్నాయి. ప్రతి ఇంటికి ఆరు మొక్కలను ఉచితంగా అందిచనున్నారు.
30 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం:
కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే మొక్కలు నాటాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది. ఈ సారి 30 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం సంకల్పించింది. గడిచిన ఐదేళ్లలో మొక్కలు నాటాలనే చైతన్యాన్ని ప్రతి ఒక్కరిలో తీసుకొచ్చింది ప్రభుత్వం. ప్రతీ ఒక్కరూ ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యులు కావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ మొక్కలు నాటేలా ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది.

ఇంటి పరిసరాల్లో నాటిన మొక్కలకు ఇంటి యజమానులే బాధ్యత:
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో హరితహారాన్ని భాగస్వామ్యం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది 30కోట్ల మొక్కలు నాటడమే లక్ష‌్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో 85 శాతం మొక్కలు తప్పనిసరిగా బతికేలా చర్యలు చేపడుతున్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఇంటి పరిసరాల్లో నాటిన మొక్కలకు ఇంటి యజమానులే బాధ్యత తీసుకునేలా నిబంధనలు రూపొందించారు. నిర్లక్యం చేసిన వారికి జరిమానా విధించనున్నట్లు పంచాయతీ రాజ్ చట్టంలో పొందుపరిచారు. ప్రతీ ఒక్కరిలో పర్యావరణపై బాధ్యత పెరిగేలా నిబంధనలు కఠినతరం చేశారు.

రాష్ట్ర మంతటా పచ్చదనం:
గత ఐదు విడతల్లో నాటిన మొక్కలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్ర మంతటా పచ్చదనం పెరుగుతోంది. రహదారుల వెంట చెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఫారెస్ట్ సర్వే ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన దేశవ్యాప్త నివేదికలో పచ్చదనం పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని స్పష్టం చేసింది. గ్రామాల్లో మొక్కలు నాటే లక్ష్యాన్ని గ్రామ స్థాయి యంత్రాంగం నిర్ధేశించుకునేలా ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ లక్ష్యాలను నిర్ణయించి అమలు చేయనుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అటవీ శాఖ అధికారులతో పలు మార్లు సమీక్ష నిర్వహించారు. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అన్ని జిల్లాల అటవీ అధికారులను అలర్ట్ చేస్తున్నారు.

Read: ప్రమోషన్ రాలేదన్న మనస్తాపంతో, తెలంగాణ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ రాజీనామా