హరితహారం పండుగ : నర్సాపూర్ కు సీఎం కేసీఆర్

  • Published By: madhu ,Published On : June 25, 2020 / 12:37 AM IST
హరితహారం పండుగ : నర్సాపూర్ కు సీఎం కేసీఆర్

జంగల్ బచావో..జంగల్ బడావో..అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో హరితహారం పండుగ స్టార్ట్ కానుంది. మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 6వ విడతలో భాగంగా 30 కోట్ల చెట్లను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

అందులో భాగంగా 2020, జూన్ 25వ తేదీ గురువారం నర్సాపూర్ కు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. అడవుల్లో కేసీఆర్‌ మొక్కలు నాటి ఆరో విడత హరితహారాన్ని ప్రారంభిస్తారు. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో కార్యక్రమంలో పలు చర్యలు తీసుకుంటున్నారు.

మాస్క్‌లు ధరించడం..ఒక్కో మొక్క దగ్గర ఒక్కరే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. భౌతిక దూరం ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ జిల్లాలోని నర్సరీలు, వాటిల్లో లభిస్తున్న మొక్కల సంఖ్య, రకాలు, ఆయా నర్సరీల సమాచారంతో డైరెక్టరీలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఈ ఏడాది దాదాపు 30 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటింటికీ ఆరు మొక్కలు ఇవ్వడం, బాధ్యతగా పెంచేలా పంచాయతీల పర్యవేక్షణ జరుగనుంది. 

ఐదు విడతల్లో నాటిన మొక్కలు (కోట్లలో) : –

2015-16 15.86 (మొక్కలు)
2016-17 31.67 (మొక్కలు)
2017-18 34.07 (మొక్కలు)
2018-19 32.00 (మొక్కలు)
2019-20 38.18 (మొక్కలు)
2020-21 30.00 (మొక్కలు) లక్ష్యం 

Read: తెలంగాణలో ఒక్కరోజే 891 కరోనా కేసులు