India-China: సరిహద్దు వివాదం.. రేపు ఇండియా- చైనా చర్చలు

లదాఖ్ సరిహద్దులో చైనా మోహరించిన దళాలను ఉపసంహరించుకోవాలని భారత్ కోరుతోంది. సరిహద్దులో శాంతి, ప్రశాంతత నెలకొనేందుకు ఈ చర్యలు తప్పనిసరి అని భారత్ అంటోంది. ఈ అంశంపై చివరిసారిగా గత మార్చి 11న చర్చలు జరిగాయి.

India-China: సరిహద్దు వివాదం.. రేపు ఇండియా- చైనా చర్చలు

India China

India-China: ఇండియా-చైనాల మధ్య నెలకొన్న తూర్పు లదాఖ్‌ సరిహద్దు వివాదంపై రేపు (జూలై 17) ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఆదివారం జరిగే ఈ చర్చల్లో రెండు దేశాలకు చెందిన సైనిక ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ అంశంపై ఇవి 16వ దశ చర్చలు కావడం విశేషం.

CM KCR : సహాయక చర్యల కోసం భద్రాచలానికి హెలికాప్టర్‌ : సీఎం కేసీఆర్‌

లదాఖ్ సరిహద్దులో చైనా మోహరించిన దళాలను ఉపసంహరించుకోవాలని భారత్ కోరుతోంది. సరిహద్దులో శాంతి, ప్రశాంతత నెలకొనేందుకు ఈ చర్యలు తప్పనిసరి అని భారత్ అంటోంది. ఈ అంశంపై చివరిసారిగా గత మార్చి 11న చర్చలు జరిగాయి. అప్పుడు చుషుల్-మోల్దోలోని మీటింగ్ పాయింట్ వద్ద చర్చలు జరిగాయి. ఈ సారి భారత వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద ఈ చర్చలు జరగుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి. తాజా చర్చల్లో లదాఖ్‌లోని కీలక ప్రాంతాల్లో చైనా మోహరించిన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి అని కోరడంతోపాటు, దెప్సాంగ్ బల్జ్, డెమ్చాక్ ప్రాంతాలపై కూడా చర్చిస్తారు.

Godavari Floods: పోల‌వ‌రం వ‌ద్ద ప్ర‌మాద‌క‌ర స్థాయిలో గోదావ‌రి ప్ర‌వాహం.. ధవళేశ్వరం వద్ద..

సరిహద్దు సమస్యపై గత వారం భారత, చైనా విదేశీ శాఖ మంత్రుల మధ్య చర్చలు జరిగాయి. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి యాంగ్ యితో బాలిలో చర్చించారు. లదాఖ్‌కు సంబంధించిన సరిహద్దు సమస్య త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలని జై శంకర్ చైనాను కోరారు. గతంలో ఇరు దేశాల సైనికుల మధ్య చర్చల ఫలితంగా పాంగ్యాంగ్ లేక్, గోగ్రా ఏరియాల్లో మోహరించిన సైన్యాన్ని రెండు దేశాలూ ఉపసంహరించుకున్నాయి.