Students hugs in classroom: క్లాస్ రూమ్‌లో స్టూడెంట్స్ రొమాన్స్

ఈ తతంగాన్ని వీడియో తీసేసరికి ఆ నోటా ఈ నోటా పాకి నెట్టింటి వరకు వచ్చింది. వీడియో వైరల్ కావడంతో కాలేజీ యాజమాన్యం అప్రమత్తమై సదరు విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసులు పంపారు. లంచ్ సమయంలో ఇలా ప్రవర్తించిన ఏడుగురు విద్యార్థుల్ని సస్పెండ్ చేశారు. అయితే విద్యార్థులు ఇలా ప్రవర్తించడం పట్ల తల్లిదండ్రులతో పాటు కాలేజీ కూడా బాధ్యత వహించాలని, కాలేజీ యాజమాన్యానికి కూడా నోటీసులు పంపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

Students hugs in classroom: క్లాస్ రూమ్‌లో స్టూడెంట్స్ రొమాన్స్

7 students suspended for hugging in classroom

Students Hugging Video: సినిమాల ప్రభావమో, మరింకేదైనా ఉందేమో కానీ పిల్లలు చిన్న వయసులోనే కొన్ని విపరీత ఆలోచనలు చేస్తున్నారు. చక్కగా చదువుకోవాల్సిన వయసులో కొన్ని రకాల వ్యాపకాలకు అలవాటు అవుతున్నారు. వాటిని వెల్లడించకూడని ప్రదేశాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా అస్సాంలోని ఒక కాలేజీలో విద్యార్థులు రొమాన్స్ చేసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‭చల్ చేస్తోంది. అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ, కౌగిళించుకుంటూ అక్షరాలు నేర్చుకోవాల్సిన చోట ఇబ్బందికర వాతావరణానికి కారణమయ్యారు. ఈ ఘటనపై నెటిజెన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో ఈ పనులు ఏంటి? తల్లిదండ్రులు, టీచర్లు వీరికి ఏం నేర్పిస్తున్నారు? అంటూ నెెటిజెన్లు మండిపడుతున్నారు. అస్సాంలోని సిల్చార్‭లో ఉన్న రామానుజన్ గుప్తా కాలేజీలో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. కాలేజీ లంచ్ విరామ సమయంలో విద్యార్థులు ఇలా ఒకరికి మరొకరు ముద్దులు, హగ్స్ ఇచ్చుకున్నారట. ఈ తతంగాన్ని వీడియో తీసేసరికి ఆ నోటా ఈ నోటా పాకి నెట్టింటి వరకు వచ్చింది. వీడియో వైరల్ కావడంతో కాలేజీ యాజమాన్యం అప్రమత్తమై సదరు విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసులు పంపారు. లంచ్ సమయంలో ఇలా ప్రవర్తించిన ఏడుగురు విద్యార్థుల్ని సస్పెండ్ చేశారు. అయితే విద్యార్థులు ఇలా ప్రవర్తించడం పట్ల తల్లిదండ్రులతో పాటు కాలేజీ కూడా బాధ్యత వహించాలని, కాలేజీ యాజమాన్యానికి కూడా నోటీసులు పంపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

Certificate case: పుట్టుకతో ముస్లిం కాదంటూ సమీర్ వాంఖడేకు క్లీన్ చిట్