రిపబ్లిక్ పరేడ్ లో మన సత్తా

రిపబ్లిక్ పరేడ్ లో మన సత్తా

Republic Day Celebrations Nationwide | దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోవత్స వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్ ఫథ్‌లో గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. త్రివిద దళాల గౌరవ వందనాన్ని కోవింద్ స్వీకరించారు. గణతంత్ర వేడుకలకు ఉపరాష్ట్రతి, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ప్రధాని మోడీ దేశ ప్రజలకు గణంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

రఫెల్ యుద్ధ విమాన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గణతంత్ర పరేడ్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన 17 శకటాలు కూడా ఉన్నాయి. ఏపీ, గుజరాత్, యూపీ, అసోం, బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పరేడ్ లో సైనిక కవాతులో 122 మంది బంగ్లాదేశ్ సైనికులు పాల్గొన్నారు. 38 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు విన్యాసాలను ప్రారంభించాయి.

ఇండియా గేట్ వద్ద అమరవీరులకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. అమర్ జవాన్ జ్యోతి వద్ద సైనికులకు మోడీ, రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు. 55ఏళ్ల తర్వాత ముఖ్య అతిథి లేకుండా గణతంత్ర వేడుకలను జరుపుకుంటున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు త్రివర్ణ పతకాలతో అలంకరించారు. ఐదంచెల భద్రతా వలయంలో సెంట్రల్ ఢిల్లీ వరకు మోహరించారు.

ఏపీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ వేడుకల్లో ఏపీ గవర్నర్, సీఎం జగన్ పాల్గొన్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆవిష్కరించారు. వేడుకల్లో మంత్రులు, సీఎస్, డీజేపీ పలువురు పాల్గొన్నారు. అసెంబ్లీ వద్ద జాతీయ జెండాను స్పీకర్ తమ్మినేని ఆవిష్కరించారు. శాసనమండలి వద్ద జాతీయ జెండాను చైర్మన్ షరీఫ్ ఆవిష్కరించారు. సచివాలయం వద్ద జాతీయజెండాను స్సెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర ఆవిష్కరించారు.

తెలంగాణ వ్యాప్తంగా గణతంత్ర దినోత్స వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో జాతీయజెండాను గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌవర వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ప్రకటించారు. తెలంగాణ భవన్ లో జాతీయ పతకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టులో జాతీయ జెండాను చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ ఆవిష్కరించారు.