Pregnant ANM : నిండు గర్భిణి అయినా భయపడలేదు, కరోనా రోగులకు సేవలందిస్తున్న ఏఎన్ఎం

ఆమె పేరు అన్నపూర్ణ. సాదాసీదా ఉద్యోగం. కానీ, ఆమె అందించే సేవలు పరిపూర్ణం. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి. అయినా వెనుకడుగు వేయకుండా, అధైర్యపడకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తన అమూల్యమైన సేవలు అందిస్తూ అందరి చేత ప్రశంసలు పొందుతోంది. ధైర్యంగా ఉందాం కరోనాను జయిద్దాం అని అందరిలో స్ఫూర్తిని నింపుతున్న ఏఎన్ఎం అన్నపూర్ణది విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రాపురం.

Pregnant ANM : నిండు గర్భిణి అయినా భయపడలేదు, కరోనా రోగులకు సేవలందిస్తున్న ఏఎన్ఎం

Pregnant Anm

Pregnant ANM : ఆమె పేరు అన్నపూర్ణ. సాదాసీదా ఉద్యోగం. కానీ, ఆమె అందించే సేవలు పరిపూర్ణం. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి. అయినా వెనుకడుగు వేయకుండా, అధైర్యపడకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తన అమూల్యమైన సేవలు అందిస్తూ అందరి చేత ప్రశంసలు పొందుతోంది. ధైర్యంగా ఉందాం కరోనాను జయిద్దాం అని అందరిలో స్ఫూర్తిని నింపుతున్న ఏఎన్ఎం అన్నపూర్ణది విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రాపురం.

ఆమె స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవలు అందిస్తోంది. వృత్తిపై నిబద్దత కనబరుస్తూ మిగతావారిలో స్ఫూర్తి నింపుతోంది. రోజూ ఉదయమే ఆఫీసుకి రావడం తనకు అప్పగించిన పనిని చేయడం. ప్రస్తుతం పీహెచ్ సీకి వస్తున్న కరోనా రోగులకు నేను సైతం అంటూ సేవలు అందిస్తోంది. అన్నపూర్ణ గర్భిణి కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు. మిగతా వారు చూసుకుంటారులే అని తోటి సిబ్బంది సూచించారు. అయినా, ఆమె వినలేదు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు సాయపడతామని చెప్పి విధులకు వస్తోంది.

సాధారణ రోగులతో పాటు కరోనా రోగులను తన సొంత మనుషుల్లా చూసుకుంటూ సేవలు అందిస్తోంది. అలాగే, కరోనా టెస్టుల నిమిత్తం శాంపుల్స్ కలెక్ట్ చేయడం, వ్యాక్సిన్ వేయడం వంటి పనుల్లో భాగస్వామ్యం అవుతూ మిగిలిన వారిలో స్ఫూర్తి నింపుతోంది. అన్నపూర్ణ సేవలతో తమపై కొంత పని భారం తగ్గుతోందని తోటి ఉద్యోగులు అంటున్నారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో బయట అడుగుపెట్టేందుకే ప్రజలు భయంతో వణికిపోతుంటే.. ఎంతో ధైర్యంతో మహిళలు తమ వృత్తికి న్యాయం చేస్తున్నారు. మొన్న ఛత్తీస్‌గఢ్‌లో ఓ మహిళా పోలీస్‌ అధికారి చూపిన అంకితభావం సోషల్ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. 5 నెలల గర్భవతి అయిన డీసీపీ శిల్పా సాహు రోడ్డు మీద వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను అమలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. నిన్న గుజరాత్‌లోని సూరత్‌లో మహిళా నర్సు గర్భవతి అయినప్పటికీ ఏమాత్రం భయపడకుండా కొవిడ్‌ బాధితులకు దగ్గరుండి సేవలు అందించడం ఆందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె చూపిన తెగువ అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

ప్రస్తుత కరోనా పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో, గర్భిణీగా ఉన్న సమయంలో తాను దగ్గరుండి కరోనా బాధితులకు వైద్యసేవలు అందించడం ఎంత ముప్పో అయేజా మిస్త్రీకి తెలుసు. కానీ, ఆమె ఏమాత్రం నెరవలేదు. మనోధైర్యంతో రోజుకు 8 గంటలపాటు నర్సుగా వైద్య సేవలు అందిస్తోంది. వెళ్లేటప్పుడు వారి ముఖాల్లో చిరునవ్వును చూసి మురిసిపోతోంది.

ఇప్పుడు ఏఎన్ఎం అన్నపూర్ణ కూడా వారి సరసన నిలిచింది. గర్భిణి అయినా భయపడకుండా ఎంతో ధైర్యంగా కరోనా రోగులకు సేవలు అందిస్తోంది. వీళ్లే కాదు.. ఎంతోమంది మహిళా డాక్టర్లు, పోలీసు అధికారులు కొవిడ్‌ కష్ట కాలంలో ఏమాత్రం భయపడకుండా ప్రజలకు సేవలు అందించడంతోపాటు, తమ వృత్తికి న్యాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.