Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ కోసం పీవీ సింధు ఎలా ప్రిపేర్ అయిందో తెలుసా..

బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు.. ఆమె కోచ్ శ్రీకాంత్ వర్మ టోర్నీకి అయిన ప్రిపరేషన్ గురించి కీలక విషయాలు బయటపెట్టారు. టోక్యోలోని ముసాషినో ఫారెస్ట్ స్పోర్ట్ ప్లాజా వేదికగా అకానె యమగూచిని చిత్తుగా ఓడించింది. క్వార్టర్ ఫైనల్స్ లో రాణించి సెమీఫైనల్స్ కు అర్హత సాధించింది.

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ కోసం పీవీ సింధు ఎలా ప్రిపేర్ అయిందో తెలుసా..

P[v Sindhu

Tokyo Olympics: బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు.. ఆమె కోచ్ శ్రీకాంత్ వర్మ టోర్నీకి అయిన ప్రిపరేషన్ గురించి కీలక విషయాలు బయటపెట్టారు. టోక్యోలోని ముసాషినో ఫారెస్ట్ స్పోర్ట్ ప్లాజా వేదికగా అకానె యమగూచిని చిత్తుగా ఓడించింది. క్వార్టర్ ఫైనల్స్ లో రాణించి సెమీఫైనల్స్ కు అర్హత సాధించింది. గతంలో జరిగిన రియో ఒలింపిక్స్ లో సిల్వర్ గెలిచారు సింధు. జులై 30న జపాన్ ప్లేయర్ అకానె యమగూచిని ఓడించి సెమీ ఫైనల్స్ దూసుకెళ్లిన సందర్భంగా ఆమె కోచ్ శ్రీకాంత్ వర్మ ఇలా మాట్లాడారు.

సింధు గురించి హై లెవల్ ఫిట్‌నెస్ పర్‌ఫార్మెన్స్ ప్రోగ్రాం రెడీ చేశాం. ఆమె శరీరతత్వం, గేమ్, శక్తి స్థాయి ఆధారంగా రూపొందించాం. వేరే అథ్లెట్ ఎవరైనా ఫాలో అయితే వారికి గాయాలయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.
వారానికి ఆరు రోజుల పాటు కచ్చితంగా రెండు నుంచి మూడు గంటల పాటు పీవీ సింధు ట్రైనింగ్ తీసుకునేది.
ట్రైనింగ్ లో పూర్తి శరీరంపై కాకుండా మజిల్స్ పైన ఫోకస్ చేసి శిక్షణ ఇచ్చాం.
తన ఫూట్ వర్క్ కదలికలకు కావాల్సిన ప్రత్యేక శక్తిపై సింధు ఫోకస్ పెట్టారు.
సికింద్రాబాద్ లో ఉండే సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీలో కండిషనింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న వర్మ.. ‘ఆమెలో నచ్చే విషయమేమిటంటే ట్రైనింగ్ కు ఎప్పుడూ నో చెప్పలేదు. ఎంత బిజీగా ఉన్నా.. నవ్వుతూ ట్రైనింగ్ కు అటెండ్ అయ్యేది. మా ఇంటెన్షన్ ఏంటంటే.. ఒలింపిక్ 2020లో హై లెవల్ ఫామ్ కనబరచాలని.. ఎందుకంటే ప్రతి రౌండ్ ఫైనల్స్ తో సమానం’
బరువు అదుపులో ఉంచుకోవడం కోసం సింధు డైట్ ఫాలో అయ్యేది. హైడ్రేషన్, రికవరీ సిస్టమ్ కోసం ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకునేది.
కోర్టులోకి వెళ్లేటప్పుడు డిఫరెంట్ ట్రైనింగ్ తీసుకునేది. వేగం అప్పటికప్పుడే అందుకుని కోర్టులో వేగం చూపించేదని కోచ్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

క్వార్టర్ ఫైనల్స్ పోరాటం:
ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు దూసుకుపోతున్నారు. మెగా ఈవెంట్లో వరుస విజయాలతో సెమీ ఫైనల్ లోకి ఎంటర్ అయిపోయారు. శుక్రవారం జపాన్ కు చెందిన అకానె యమగూచిపై 21-13, 22-20తేడాతో అద్భుతమైన విజయం సాధించారు. తొలి సెట్లో దూసుకెళ్లిన సింధుకు రెండో సెట్లో టఫ్ ఫైట్ ఎదుర్కొన్నారు. సెమీస్ కు చేరాలనే కసితో కనిపించిన సింధు.. చివర్లో పుంజుకుని సత్తా చాటారు.