Girl Imitates Mom : వర్క్ ఫ్రంహోమ్ లో తల్లి ఎంత టెన్షన్ తో పని చేస్తుందో అనుకరించిన చిన్నారి

వర్క్ ఫ్రంహోమ్ లో మహిళలు ఎంత మల్టీ టాస్కింగ్ తో పనిచేస్తారో ఓ బాలిక తన తల్లిని అనుకరిస్తూ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తల్లి ఓ వైపు ఆఫీసు పని..మరోవైపు పిల్లలు అల్లరి చేస్తుంటే ఎలా మందలిస్తుందో..అదేసమయంలో ఆఫీసు నుంచి వచ్చిన ఫోన్ కాల్ ను ఎలా అటెండ్ చేస్తుందో 8 ఏళ్ల బాలిక వీడియో కళ్లకు కట్టినట్లుగా చూపించింది.

Girl Imitates Mom : వర్క్ ఫ్రంహోమ్ లో తల్లి ఎంత టెన్షన్ తో పని చేస్తుందో అనుకరించిన చిన్నారి

Girl Imitates Mom Working From Home

girl imitates mom working from home : ఈ కరోనా వచ్చాక ఆదేశం అని లేదు ఈ దేశం అని లేదు..చాలా దేశాల్లో వర్క్ ఫ్రంహోమ్ చేస్తున్నారు. చాలా కంపెనీలు కరోనాకు భయపడి వారి ఉద్యోగులకు వర్క్ ఫ్రంహోమ్ ను ప్రొవైడ్ చేశాయి. ఈ క్రమంలో మహిళలకు డబుల్ కాదు ట్రిపుల్ టాస్క్ లు అయిపోయాయి. స్కూల్ లేకుండా ఇంట్లోనే ఉండే పిల్లలు..ఇంటిపని..ఆఫీసు పని మరోపక్క భర్తగారికి చేసే సేవలు ఇలా పనులు ఒత్తిడికి గువుతున్నారు.

దీంతో ఇంట్లో వారికి సమాధానం చెబుతూ..వారికి కావాల్సింది వండిపెడుతూ..చేసి పెడుతూ మరోపక్క ఆఫీసు వర్క్..ఆఫీసు నుంచి వచ్చే ఫోన్లకు సమాధానం చెబుతూ..ఇంకోపక్క ఇంట్లో పిల్లల అల్లరి కట్టడి చేస్తూ ఇలా ఒకచేత్తో వంటపనులు చక్కబెట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆఫీసు పనిచేసుకుంటుండగా మధ్యలో పిల్లలు వస్తే ఆ తల్లి ఎలా వారిని అదుపు చేస్తుంది. అదే సమయంలో ఆఫీసు నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ కు ఎలా సమాధానం..సదరు మహిళ ఎలా మల్టీ టాస్కింగ్ చేస్తుందో తెలిపే ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ బాలిక తన తల్లిని ఇమిటేట్ (అనుకరిస్తూ) చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైలర్ గా మారింది. ఆమెరికాలోని వర్జీనియాకు చెందిన కొలీన్ చులిస్ అనే మహిళ వర్క్ వర్క్ ఫ్రం హోం చేస్తోంది. ఆ సమయంలో ఆమె తల్లి ఎలా చేస్తుందో అచ్చంగా అలాగే కొలీన్ 8 ఏళ్ల కుమార్తె అడెల్లె అలాగే చేసింది. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో అది వైరల్ గా మారింది.కొలీన్ ఆఫీసు పనిచేసేటప్పుడు ఎలా ప్రవర్తిస్తోంది. అదే సమయంలో ఆమె పిల్లలు ఆమె ఆఫీసు టేబుల్ వద్దకు వచ్చి అల్లరి చేస్తుంటే ఎలా మందలిస్తుందో..అదే సమయంలో ఆఫీసు ఫోన్ వస్తే ఎలా సమాధానం చెబుతుందో ..పిల్లలు ఇక్కడకు రావద్దు డిస్ట్రబ్ చేయొద్దు అని చిటికెలు వేసి ఎలా చెబుతుందో ఎనిమిదేళ్ల అడెల్లె చక్కగా అచ్చుగుద్దినట్లుగా తల్లిలా చేయటం వర్క్ ఫ్రం హోమ్ లో మహిళల మల్టీ టాస్కింగ్ కళ్లకు కట్టినట్లుగా చేసింది.

కాగా కొలీన్ కు ముగ్గురు పిల్లలున్నారు. 10 ఏళ్ల లూకా, 8 ఏళ్ల అడెల్లె, 6 ఏళ్ల డెక్లాన్ ఉన్నారు. ఈ ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ కొలీన్ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. ఆమె ఆఫీసు వర్క్ చేసేటప్పుడు పిల్లలు అక్కడకు వచ్చి అల్లరి చేస్తున్నా..ఇబ్బంది పెడుతున్నా ఆమె ఎలా చేస్తుందో అచ్చంగా ఆమె ఎనిమిదేళ్ల కూతురు అడెల్లె అలాగే చేసింది. ఈ వీడియో వర్క్ ఫ్రం హోమ్ లో మహిళల పరిస్థితిని కళ్లకు కడుతోంది.