Covid Cases In Mumbai : ముంబైలో పెరిగిపోతున్న కోవిడ్ కేసులు..94శాతం కేసులు అవేనంట!

ముంబైలో కొద్ది రోజులుగా కరోనా కేసులు మళ్లీ భారీ సంఖ్యలో వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో ముంబైలో 8వేల 86 కొత్త కోవిడ్ కేసులు,రెండు మరణాలు నమోదయ్యాయి.

Covid Cases In Mumbai : ముంబైలో పెరిగిపోతున్న కోవిడ్ కేసులు..94శాతం కేసులు అవేనంట!

Covid (1)

Covid Cases In Mumbai :  ముంబైలో కొద్ది రోజులుగా కరోనా కేసులు మళ్లీ భారీ సంఖ్యలో వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో ముంబైలో 8వేల 82 కొత్త కోవిడ్ కేసులు,11 మరణాలు నమోదయ్యాయి. అయితే ఇందులో 94శాతం కేసులు అసింప్టమాటిక్(రోగ లక్షణాలు లేని)అని అధికారిక డేటా చెబుతోంది. ముంబైలో ప్రస్తుతం 37,274 యాక్టివ్ కోవిడ్ కేసులున్నాయి

గడిచిన 24గంటల్లో ముంబైలో కోవిడ్ తో హాస్పిటల్స్ లో చేరింది 574మంది మాత్రమేనని డేటా తెలిపింది. ఆసుపత్రిలో చేరిన 574 మంది రోగులలో 71 మంది ఆక్సిజన్ సపోర్టులో ఉన్నారు. కాగా, భయాందోళనలను తగ్గించడానికి హాస్పిటల్స్ లో చేరినవారు,అసింప్టమాటిక్ కేసుల సమాచారాన్ని ఇప్పుడు రోజువారీ ఆరోగ్య బులెటిన్‌లలో చేర్చుతున్నట్లు మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే తెలిపారు. ఇక,మహారాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 12,160 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

ఇక,ముంబై నగరంలో రోజువారీ కేసులు 20,000 దాటితే లాక్‌డౌన్ ప్రకటించబడుతుందని నగర పౌర సంస్థ చీఫ్ ఇక్బాల్ సింగ్ చాహల్ తెలిపారు.

కాగా,మహారాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 68 కొత్త ఒమిక్రాన్ కేసులు బయటపడగా,ఇందులో 40 కేసులు ముంబైలోనే నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కి చేరింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో అత్యధికంగా నమోదైంది మహారాష్ట్రలోనే.

ALSO READ TS Covid Update : తెలంగాణ కొత్తగా 482 కోవిడ్ కేసులు