‘83’ రిలీజ్ ఎప్పుడంటే..

‘83’ రిలీజ్ ఎప్పుడంటే..

83 Movie: టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌ ’83’ పేరుతో సినిమాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కపిల్ దేవ్ పాత్రలో ర‌ణ్‌వీర్ సింగ్ నటిస్తున్నారు. 1983లో భారత జట్టు ప్రపంచకప్‌ ఎలా సాధించింది అనే ఆసక్తికర అంశంతో క‌బీర్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ మూవీలో కపిల్ భార్య రోమి భాటియా (రోమి దేవ్) పాత్రలో దీపికా పదుకొణె కనిపించనుంది.

83

రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, విబ్రి మీడియా, ఫాంటోమ్ ఫిల్మ్స్, కేఎ ప్రొడక్షన్స్, కబీర్ ఖాన్ ఫిల్మ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ‘83’ విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

83

2021 జూన్ 4న హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ‘83’ మూవీ భారీ స్థాయిలో విడుదల కానుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు అన్న‌పూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ తెలుగులో ‘83’ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. అలాగే తమిళ్‌లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సమర్పిస్తుండడం విశేషం.

83