Job Resign: వచ్చే ఆర్నెళ్లలో ఆ రంగాల్లో 86శాతం ఉద్యోగులు రాజీనామా చేస్తారంట.. ఎందుకంటే..?

గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా భారతదేశంలో పలు కంపెనీల్లో ఉద్యోగాలకు రాజీనామా చేసిన వారి సంఖ్య పెరిగింది. అయితే ప్రస్తుతం కొవిడ్ వ్యాప్తి తగ్గుతున్న క్రమంలో అలాంటి పరిస్థితి పునరావృతం కాదని పలు కంపెనీలు భావించాయి. కానీ ఈ రాజీనామాల ప్రక్రియ 2022 సంవత్సరంలోనూ కొనసాగే అవకాశం ఉందని ఉద్యోగాలు, నియామక ఏజెన్సీ మైఖేల్ పేజ్ సర్వే తెలిపింది. తాజా ఏజెన్సీ నిర్వహించిన సర్వే ప్రకారం.. రాబోయే ఆరు నెలల్లో 86% మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయబోతున్నట్లు పేర్కొంది.

Job Resign: వచ్చే ఆర్నెళ్లలో ఆ రంగాల్లో 86శాతం ఉద్యోగులు రాజీనామా చేస్తారంట.. ఎందుకంటే..?

Eempolys

Job Resign: గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా భారతదేశంలో పలు కంపెనీల్లో ఉద్యోగాలకు రాజీనామా చేసిన వారి సంఖ్య పెరిగింది. అయితే ప్రస్తుతం కొవిడ్ వ్యాప్తి తగ్గుతున్న క్రమంలో అలాంటి పరిస్థితి పునరావృతం కాదని పలు కంపెనీలు భావించాయి. కానీ ఈ రాజీనామాల ప్రక్రియ 2022 సంవత్సరంలోనూ కొనసాగే అవకాశం ఉందని ఉద్యోగాలు, నియామక ఏజెన్సీ మైఖేల్ పేజ్ సర్వే తెలిపింది. తాజా ఏజెన్సీ నిర్వహించిన సర్వే ప్రకారం.. రాబోయే ఆరు నెలల్లో 86% మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయబోతున్నట్లు పేర్కొంది. 12దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. తమ ప్రస్తుత ఉద్యోగాలను విడిచిపెట్టాలని భావిస్తున్న ఉద్యోగుల శాతం భారతదేశంలో ఎక్కువగా ఉందని సర్వేలో తేలింది. భారత్ తరువాత ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియాలు ఉన్నట్లు మైఖెల్ పేజ్ సర్వే పేర్కొంది. ఇదిలాఉంటే టెక్నాలజీ అండ్ టెలికాం, పరిశ్రమల రంగాల్లో పనిచేసే ఉద్యోగులు ఎక్కువగా రాజీనామా చేయాలని భావిస్తున్నారని సర్వేలో తేలింది.

CM KCR: త్వరలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ..? నెలాఖరులో ఢిల్లీలో ప్రకటించే ఛాన్స్..

అయితే సర్వేలో తేలిన ఆశ్చర్యకర విషయం ఏమిటంటే తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని భావిస్తున్న వారిలో సంస్థల రెండేళ్లలోపు అనుభవం ఉన్నవారే ఎక్కువగా ఉన్నారట. ఆయా సంస్థల్లో రెండేళ్లలోపు అనుభవం కలిగిన 38శాతం మంది వచ్చే ఆర్నెళ్లలో రాజీనామాకు సిద్ధపడుతున్నట్లు మైఖెల్ పేజ్ సర్వే తెలిపింది. మేనేజర్ స్థాయిలో ఉన్నవారు 89శాతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. ది గ్రేట్ X పేరుతో నిర్వహించిన సర్వే నివేదిక ప్రకారం.. 61% మంది భారతీయ ఉద్యోగులు పని, జీవిత సమతుల్యత, ఎక్కువ సంతోషాన్ని పొందేందుకు ప్రస్తుతం ఉన్న కంపెనీలో ప్రమోషన్ ను సైతం వదులుకొని తక్కువ జీతానికి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారని మైఖెల్ పేజ్ సర్వే పేర్కొంది. రాజీనామా చేసిన, రాజీనామా చేయాలనుకునే 11శాతం మంది ఉద్యోగులు తమ రాజీనామాకు ఇదే కారణమని పేర్కొన్నారు.

BJP Laxman: కేసీఆర్ ఎన్ని విన్యాసాలు చేసినా ఎవరు నమ్మరు ..

మైఖెల్ పేజ్ సర్వే నివేదిక ప్రకారం.. రాజీనామాకు మొదటి ఐదు కారణాలు తెలిపింది. కెరీర్ పురోగతి లేకపోవటం, ప్రమోషన్ రాకపోవటం (48%), ఇతర ప్రాంతాల్లో, పరిశ్రమల్లో పనిచేసేందుకు ఇష్టపడక(48%), వచ్చే జీతంతో సంతృప్తి చెందకపోవడం (38%), తమ కంపెనీ భవిష్యత్ పై నమ్మకం లేకపోవటం, తమ భవిష్యత్ కు భరోసా లేకపోవటం(23%). వంటి ప్రధాన కారణాలతో ఎక్కువ మంది ఉద్యోగులు రాజీనామాకు సిద్ధమైనట్లు సర్వే పేర్కొంది.