Heavy Rains: అసోం, మేఘాలయలో భారీ వరదలు.. తొమ్మిది మంది మృతి

మేఘాలయ, అసోం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలు భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురయ్యాయి. అసోం, మేఘాలయలో వరదల ప్రభావానికి ఆరుగురు చిన్నారులుసహా తొమ్మిది మంది మరణించారు. కొండ చరియలు విరిగిపడటం వల్ల ఒక ఇల్లు కూలిపోయింది.

Heavy Rains: అసోం, మేఘాలయలో భారీ వరదలు.. తొమ్మిది మంది మృతి

Heavy Rains

Heavy Rains:ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మేఘాలయ, అసోం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలు భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురయ్యాయి. అసోం, మేఘాలయలో వరదల ప్రభావానికి ఆరుగురు చిన్నారులుసహా తొమ్మిది మంది మరణించారు. కొండ చరియలు విరిగిపడటం వల్ల ఒక ఇల్లు కూలిపోయింది. ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు.

Appalayagunta : సూర్య, చంద్ర ప్రభ వాహానాలపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వైభవం

మృతులను పదకొండేళ్ల హుసేన్ అలీ, ఎనిమిదేళ్ల అస్మా ఖాటూన్ అనే చిన్నారులుగా గుర్తించారు. ఈ ఏడాది ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు, కొండచరియలు విరిగి పడటం కారణంగా ఇప్పటివరకు 46 మంది మరణించారు. గురువారం నాగాలాండ్, త్రిపురలో భారీ వర్షాలు, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలతోపాటు అసోం, మేఘాలయలో అతి భారీ వర్షాలు కురిశాయి. మరో ఐదు రోజులపాటు ఇలాంటి వాతావరణమే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రా పరిధిలో వరదల ప్రభావానికి ఆరో నెంబర్ జాతీయ రహదారి ధ్వంసమైంది. వర్షాల కారణంగా మరణించిన వాళ్ల కుటుంబాలకు రాష్ట్ర సీఎం నాలుగు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. అసోంలోని 25 జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. దాదాపు 11 లక్షల మంది జీవనం స్తంభించింది. స్థానిక బ్రహ్మపుత్ర, గౌరంగ నదులు ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి.

Donkey Milk Farm: ఐటీ జాబ్ వదిలి గాడిద పాల వ్యాపారం

19782.80 హెక్టార్లలో పంట నష్టం కలిగింది. 1,510 గ్రామాలు నీట మునిగాయి. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు. అసోం రాజధాని గుహవటి మూడు రోజులుగా వరదలోనే ఉంది. నగరంలోని అనేక ప్రాంతాలు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. గురువారం ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి, ఇళ్లన్నీ నీట మునిగాయి.