Two Genitals : 20ఏళ్ళ యువతికి రెండు జననాంగాలు ; 18ఏళ్ళ వయస్సులో వైద్యుల గుర్తింపు

అమెరికాకు చెందిన పెయిజ్ డిఎంజె అనే మహిళ వయస్సు 20 సంవత్సరాలు. ఆమె శరీరంలో రెండు జననాంగాలు ఉన్నాయి.

10TV Telugu News

Two Genitals : ప్రపంచంలో నిత్యం అనేక అరుదునై విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. వాటిలో కొన్ని ప్రత్యేకంగా, చాలా ఆసక్తిగా ఉంటాయి. అయితే ప్రస్తుతం మనం చెప్పుకోబోయేది కూడా అలాంటిదే.. అమెరికాకు చెందిన పెయిజ్ డిఎంజె అనే మహిళ వయస్సు 20 సంవత్సరాలు. ఆమె శరీరంలో రెండు జననాంగాలు ఉన్నాయి. సంతానోత్పత్తి గర్భాశాయాలు కూడా రెండు ఉన్నాయి. అయితే ప్రతి రెండు వారాలకు ఒకసారి పిరియడ్స్ వస్తుండటంతో స్ధానికంగా ఉన్న గైనకాలజిస్ట్ ను సంప్రదించింది.

ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు ఓ షాకింగ్ విషయం చెప్పారు. అదేంటంటే పెయిజ్ శరీరంలో రెండు జననాంగాలు ఉండటం వల్లే , రెండు వారాలకు ఒకసారి పిరియడ్స్ వస్తున్నట్లు స్పష్టం చేశారు. వైద్యులు ఆవిషయాన్ని చెప్పేనాటికి ఆమెకు వయస్సు 18 సంవత్సరాలు. అంటే 18 సంవత్సరాలు వచ్చే వరకు ఆమె శరీరంలో రెండు జననాంగాలు ఉన్నాయన్న విషయం పెయిజ్ గమనించలేకపోయింది.

పెయిజ్ పుట్టుకతోనే ఈ లోపం ఉన్నట్లు తెలుస్తుంది. చాలా సార్లు పిరియడ్స్ రోజుల వ్యవధిలోనే వచ్చేవి. ఆమె హైస్కూల్ జీవితం మొత్తం అసలు విషయం తెలియకుండానే అలాగే గడిపేసింది. ప్రస్తుతం ఆమె వయస్సు 20 సంవత్సరాలు. పెయిజ్ విషయం తెలిసిన చాలా మంది ఆమె శృంగార జీవితంపై అనేక అనుమానాలు, అపోహలు వ్యక్తం చేసేవారు. అయితే పెయిజ్ కు ఎలాంటి శృంగార సమస్యలు లేవు. ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు.

ప్రస్తుతం పెయిజ్ కు పిల్లల్ని కనాలన్న కోరిక కలిగింది. ఈక్రమంలో మరో మారు వైద్యులను సంప్రదించింది. తనకున్న సమస్యపై ఫేస్ బుక్ ద్వారా కొందరు స్నేహితులతో పంచుకుంది. ఇదే సమస్యతో బాధపడుతున్న కొందరు పెయిజ్ కు పరిచయమయ్యారు. అయితే వారిలో ఓ మహిళ ఐదు గర్భస్రావాల తరువాత బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె గురించి తెలుసుకున్న పెయిజ్ తనకు కూడా సంతానం కలుగుతుందన్న ఆశతో జీవిస్తుంది.

10TV Telugu News