Snake Bite: చిన్నారికి పాముకాటు.. తిడతారని ఇంట్లో చెప్పలేదు!

పిల్లలంటే ఆటలు సహజం. తెలిసీ తెలియని వయసులో గంతులేయడం దెబ్బలు తాకడం కూడా సహజమే. అలానే ఆడుకుంటున్న పాపకి ఎక్కడ నుండి వచ్చిందో పాము కాటేసి వెళ్ళింది. దీంతో భయపడిన ఆ చిన్నారి ఇంట్లో వాళ్ళకి కాలికి మేకు గుచ్చుకుందని అబద్దం చెప్పింది.

Snake Bite: చిన్నారికి పాముకాటు.. తిడతారని ఇంట్లో చెప్పలేదు!

Snake Bite

Snake Bite: పిల్లలంటే ఆటలు సహజం. తెలిసీ తెలియని వయసులో గంతులేయడం దెబ్బలు తాకడం కూడా సహజమే. అలానే ఆడుకుంటున్న పాపకి ఎక్కడ నుండి వచ్చిందో పాము కాటేసి వెళ్ళింది. దీంతో భయపడిన ఆ చిన్నారి ఇంట్లో వాళ్ళకి చెప్తే మళ్ళీ ఆడుకునేందుకు పంపరనో.. తిడతారనో కాలికి మేకు గుచ్చుకుందని అబద్దం చెప్పింది. గాయం కూడా పెద్దది కాకవడంతో ఇంట్లో వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు.

కానీ కాసేపటికే పాప నోట్లో నుండి నురగలు కక్కుతూ పడిపోయింది. చివరికి ఎన్ని ఆస్పత్రులు తిప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారుకొండ రామవరంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఉల్వనూరు పంచాయతీ లక్ష్మీదేవిపల్లి చెందిన బోడ భాస్కర్, భారతి దంపతులకు ఎన్నాళ్ళకు సంతానం కలగకపోవడంతో ఏడేళ్ల క్రితం బంధువుల పాప అఖిలను దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.

ఆదివారం ఎనిమిదో పుట్టినరోజు కావడంతో అమ్మమ్మ ఇంటి వద్ద వేడుక జరుపుకోవాలని శనివారం కారుకొండ రామవరం వెళ్లారు. ఆ సాయంత్రం చిన్నారి స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ఓ విష పాము వేలిపై కాటేసింది. పాముకాటుతో భయపడిన అఖిల ఇంట్లోకి వెళ్లి కూర్చుంది. అయితే, తల్లిదండ్రులు తిడతారనే భయంతో పాము కాటేసిన విషయాన్ని దాచిపెట్టి మేకు గుచ్చుకుందని అబద్ధం చెప్పింది. గాయం చిన్నదే కావడంతో వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు.

అయితే, కొద్దిసేపటికే అఖిల నోట్లోంచి నురగ రావడంతో వేలిపై పాము కాట్లను గుర్తించి స్థానిక ఆర్‌ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించి.. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తీసుకెళ్లారు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా పాపని చేర్చుకోలేదు. చివరికి అంబులెన్స్‌లో ఖమ్మం తరలించి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. చివరికి చిన్నారి పుట్టినరోజైన ఆదివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహిచాల్సి రావడం స్థానికులను కలచివేసింది.