Viral Clever Idea : ఈ రైతు.. పక్షుల నుంచి పంటపొలాన్ని తెలివిగా ఎలా కాపాడుకున్నాడో చూడండి!

ఆరైతు ఏంచేశాడంటే ఓ బొమ్మను తయారు చేసి దానికి పై భాగంలో చొక్కా, క్రింది భాగంలో చీర, తలభాగానికి ఓ ముసుగు కప్పి దాని చేతిలో స్పింగ్ లాంటి ఇనుప కమ్మీకి సైకిల్ హ్యాండిల్స్ పట్టుకుని ఉన్నట్లు పొలంలో ఓ ప్రతిమను ఏర్పాటు చేశాడు.

Viral Clever Idea : ఈ రైతు.. పక్షుల నుంచి పంటపొలాన్ని తెలివిగా ఎలా కాపాడుకున్నాడో చూడండి!

పక్షుల నుండి పంటపొలాన్నిరక్షించుకునేందుకు

Viral Clever Idea : గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పంట పొలాలను పక్షల నుంచి రక్షించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చివరకు పక్షుల పాలైతే చేసే శ్రమ, పెట్టిన పెట్టుబడి అంతా వృధా అవుతుంది. చిన్న పక్షులే కధా, మహా అయితే ఎంత తింటాయిలే అని చాలా మంది అనుకుంటారు. అయితే అది పొరపాటు..ఆహారం కనిపిస్తే చాలు వేల సంఖ్యలో పక్షుల దండు ఒక్కసారిగా వాలిపోతుంది. పొలంలో ఉన్న ధాన్యాన్ని తినేస్తాయి. పక్షులే కాదు.. అడవి పందులు ఇతరత్రా జంతువులు పంటను నాశనం చేసి రైతులకు నష్టం కలిగిస్తుంటాయి.

పక్షుల బెడత నుండి పంట పొలాలను కాపాడుకునేందుకు రైతులు వివిధ రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. పొలంలో మంచలను ఏర్పాటు చేసుకుని దానిపై నుండి డబ్బాలతో శబ్ధాలు చేయటం, సైరన్ మొతలు పెట్టటం… వీడియో క్యాసెట్ ఫిల్మ్ ను తాళ్ళతో పొలం నిండా కట్టటం వంటివి చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఓ రైతు తన పంట పొలంలోకి పక్షులు రాకుండా చేసేందుకు విన్నూత్న ఆలోచన చేశాడు. అతను చేసిన విన్నూత్న ఆలోచనకు ప్రస్తుతం నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇంతకీ ఆ రైతు ఏంచేశాడంటే ఓ బొమ్మను తయారు చేసి దానికి పై భాగంలో చొక్కా, క్రింది భాగంలో చీర, తలభాగానికి ఓ ముసుగు కప్పి దాని చేతిలో స్పింగ్ లాంటి ఇనుప కమ్మీకి సైకిల్ హ్యాండిల్స్ పట్టుకుని ఉన్నట్లు పొలంలో ఓ ప్రతిమను ఏర్పాటు చేశాడు. స్పింగ్ వల్ల నిరంతరం బొమ్మ అటు ఇటూ కదులుతుండటంతో పొలంలో ఎవరో ఉన్నారన్న అలికిడితో పక్షలు పొలం దరిదాపులకు రావటంలేదు. పక్షలు సంగతి పక్కన పెడితే ఈ బొమ్మను హఠాత్తుగా చూస్తే మనుషులు భయపడి గుండెపగిలి చనిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇక రాత్రి పూట పొరపాటున ఎవరికైనా ఈ బొమ్మ కంటపడిందా ఇక అంతే సంగతులని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో చక్కర్లు కొడుతుంది. లైక్ లు కామెంట్ల తో నెటిజన్లు ముంచెత్తతున్నారు.