Heavy Rain: బియ్యం నీటిపాలు.. వరద నీటిలో కొట్టుకుపోయిన బియ్యం లారీ.. వీడియో వైరల్

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భోపాల్‌పట్నం బ్లాక్‌లోని మెట్టుపల్లి (పామ్‌గల్) గ్రామానికి చెందిన పెద్దవాగులో బియ్యం లోడుతో వెళ్తున్న లారీ కొట్టుకుపోయింది. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది.

Heavy Rain: బియ్యం నీటిపాలు.. వరద నీటిలో కొట్టుకుపోయిన బియ్యం లారీ.. వీడియో వైరల్

Lory

Heavy Rain: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. భోపాల్‌పట్నం బ్లాక్‌లోని మెట్టుపల్లి (పామ్‌గల్) గ్రామానికి చెందిన పెద్దవాగులో బియ్యం లోడుతో వెళ్తున్న లారీ కొట్టుకుపోయింది. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. అధికారుల సమాచారం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ట్రక్కు పీడీఎస్ బియ్యం, ఇతర సామగ్రితో సంకన్‌పల్లికి బయలుదేరింది. మార్గమధ్యంలో వాగు దగ్గర వాహనం చెడిపోవడంతో డ్రైవర్‌ బీజాపూర్‌కు వచ్చాడు. రాత్రి కురిసిన భారీ వర్షానికి డ్రెయిన్‌ పొంగి పొర్లడంతో లారీ కొట్టుకుపోయింది.

Viral Video: పిల్లలకు కోపమొచ్చింది.. బీహార్‌లో పాఠశాల భవనాన్ని ధ్వంసం చేసిన విద్యార్థులు

ఈ లారీలో 200 క్వింటాళ్ల బియ్యం, పంచదార తదితర వస్తువులు ఉన్నాయి. లారీ మనీష్ ట్రాన్స్‌పోర్ట్ బీజాపూర్‌కు చెందినదిగా గుర్తించారు. సమాచారం అందుకున్న భూపాలపట్నం ఎస్డీఎం, ఉసూరు తహసీల్దార్, బీజాపూర్ ఫుడ్ ఆఫీసర్ గణేష్ కుర్రే సంఘటనా స్థలానికి బయలుదేరారు. అయితే భారీ వర్షం కారణంగా ఘటన స్థలానికి వారు చేరుకోలేకపోయారు. కొంగుపల్లి మార్గం గుండా పీడీఎస్‌ బియ్యం తరలింపు కొనసాగుతున్నట్లు సమాచారం. వర్షం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది.

ఛత్తీస్‌గఢ్‌లో వర్షం ప్రభావం కనిపిస్తోంది. గత రెండు రోజులుగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బీజాపూర్ జిల్లాలో వరుసగా రెండో రోజు భారీవర్షం కురిసింది. ఓ గ్రామస్థుడు నదిలో కొట్టుకుపోయాడు. అతనికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కంకేర్ జిల్లాలో దూద్ నది ఉదృతికి డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఆప్రాంతంలో ట్రాఫిక్ నిలిపివేశారు. చరమ డెవలప్‌మెంట్ బ్లాక్‌లో పడి ఒకరు మృతి చెందారు. బీజాపూర్, దంతేవాడ, సుక్మాలో ఆదివారం కూడా అతి భారీ వర్షాలు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.