Musi River: మూసీ నదిలో మత్స్య‌కన్యలా? నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో.. నెటిజన్లు ఏమన్నారంటే..

భాగ్యనగరంలో గత వారం రోజులుగా వర్షాలు దంచికొట్టడంతో మూసీనది ఉప్పొంగింది.. ఇప్పుడిప్పుడే మూసీలో వరద ఉధృతి తగ్గుముఖం పడుతుంది. మూసీలో మత్స్య కన్యలు ఉన్నాయంటూ ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. నమ్మశక్యం కానిరీతిలో ఉన్న వీడియోపై ’ వాట్సాప్ యూనివర్శిటీ రత్నాల’ పనే అంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.

Musi River: మూసీ నదిలో మత్స్య‌కన్యలా? నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో.. నెటిజన్లు ఏమన్నారంటే..

Matsyakanya

Musi River: భాగ్యనగరంలో గత వారం రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో మూసీ నది పొంగిపొర్లుతుంది. మూసీ పరివాహక ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఇప్పుడిప్పుడే వర్షాలు తెరిపినివ్వడంతో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు తమ నివాసాలకు చేరుకుంటున్నారు. అయితే మూసీలో మత్స్య‌కన్యలు ఉన్నాయంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మత్స్య‌కన్యలు సముద్రాల్లో ఉంటాయంటారు..  మురుగు ప్రవహించే మూసీ నదిలో కూడా ఉంటాయా అని మీకు డౌట్ రావొచ్చు.

Musi River : ఎడతెరిపిలేని వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసీ నది

ఓ వ్యక్తి ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. ‘జెమ్స్ ఆఫ్ వాట్స‌ప్ యూనివ‌ర్శిటీ’ ఈ వీడియోను క్రియేట్ చేసి ఉంటారంటూ తెలిపాడు. అయితే ఈ వీడియోలో మూసీ నదిలోని ఓ బ్రిడ్జి పక్కన మత్స్య కన్య ఆకారంలో ఒకటి బండరాళ్లపై కూర్చొని ఉన్నట్లు కనిపిస్తోంది. కొద్దిసేపటికి అది అక్కడి నుంచి చేపలు ఎగిరి గంతులేసినట్లు బండరాళ్లపై నుంచి గంతులేసుకుంటూ నీళ్లలోకి జారుకున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో పక్కనే మరో మత్స్య కన్య ఆకారం కనిపిస్తుంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మూసీలో మత్స్య కన్యలేమో కానీ.. ఎవ‌రో వీడియో ను మాత్రం మస్తు క్రియేట్ చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. కనిపించే వీడియోలో మత్స్య కన్య ఆకారంలో కనిపించినా నమ్మసక్యంగా లేదని, ఇదంతా వాట్సాప్ యూనివ‌ర్శిటీ రత్నాల పనేనంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజమేలేండి.. సముద్రాల్లోనే కనిపించని మత్స్య కన్యలు మురుగునీరు ప్రవహించే మూసీ నదిలో ఎలా కనిపిస్తాయో..!?