PV Sindhu: మరోసారి అవకాశం.. పి.వి.సింధుకు అరుదైన గౌరవం..

తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పి.వి.సింధుకు అరుదైన అవకాశం లభించింది. బర్మింగ్ హోమ్ వేదికగా ఈనెల 28 నుంచి కామన్వెల్త్ గేమ్స్ మొదలు కానున్నాయి. ఆ ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారిగా  పి.వి. సింధు వ్యవహరించనున్నారు.

PV Sindhu: మరోసారి అవకాశం.. పి.వి.సింధుకు అరుదైన గౌరవం..

Pv Sindhu

PV Sindhu : తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పి.వి.సింధుకు అరుదైన అవకాశం లభించింది. బర్మింగ్ హోమ్ వేదికగా ఈనెల 28 నుంచి కామన్వెల్త్ గేమ్స్ మొదలు కానున్నాయి. ఆ ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారిగా  పీ.వీ. సింధు వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధికారికంగా బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.

PV Sindhu: లాల్‌ద‌ర్వాజా అమ్మ‌వారికి బంగారు బోనం స‌మ‌ర్పించిన పీవీ సింధు

2018 కామన్వెల్త్ గేమ్స్ లోనూ భారత పతాకధారిగా పీవీ సింధు వ్యవహరించింది. వాస్తవానికి ఈనెల 6న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ను పతాకధారిగా ఎంపిక చేశారు. కానీ, గాయం కారణంగా అతను కామన్వెల్త్ గేమ్స్ నుంచి దూరంకావడంతో పీ.వీ సింధూకు మరోసారి ఈ అరుదైన అవకాశం దక్కింది.

PV Sindhu : సింగపూర్ ఓపెన్ విజేత సింధుపై ట్రోల్స్.. స్పందించిన కోచ్

ఐఓఏ (ఇండియా ఒలింపిక్ అసోసియేషన్) యాక్టింగ్ ప్రెసిడెంట్ అనిల్ ఖన్నా, సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా, ట్రెజరర్ ఆనందేశ్వర్ పాండే, టీమ్ ఇండియా చెఫ్ డి మిషన్ రాజేష్ భండారీలతో కూడిన నలుగురు సభ్యుల కమిటీ ముగ్గురు అథ్లెట్లను షార్ట్ లిస్ట్ చేసింది. నీరజ్ చోప్రా తరువాత పతాకధికారి కోసం వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా పేర్లను కూడా పరిశీలించారు. చివరికి ఖన్నా, మిస్టర్ మెహతా శ్రీమతి సింధు ప్రారంభోత్సవానికి భారత పతాకధారిగా పివి సింధును ఎంపిక చేశారు.