Lulu Gourp : యూఏఈలో భారత వ్యాపార దిగ్గజానికి అరుదైన గౌరవం

గల్ష్ కో ఆపరేషన్ కౌన్సిల్ దేశాలతోపాటు ఇతర ప్రాంతాలలో 210 లులూ అవుట్ లెట్లతో పాటు, 13 మాల్స్ ఉన్నాయి.

Lulu Gourp : యూఏఈలో భారత వ్యాపార దిగ్గజానికి అరుదైన గౌరవం

Lulu Mall

Lulu Gourp : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుధాబిలో భారతదేశానికి చెందిన వ్యాపార వేత్త , లులూ గ్రూప్ ఛైర్మన్ ఎంఏ యూసఫ్ ఆలీకి అరుదైన గౌరవం దక్కింది. అబుధాబి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి వైస్ ఛైర్మన్ గా యూసఫ్ ఆలీ నియమితులయ్యారు. 29 మంది బోర్డు సభ్యులున్న ఏడీసీసీఐకి భారత్ కు చెందిన యూసఫ్ ఆలీ ఛైర్మన్ గా నాయకత్వం వహించనున్నారు. అబుధాబి ఏడీసీసీఐకి నూతన డైరెక్టర్లతో బోర్డును ఏర్పాటు చేయాలని క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తాజాగా తీర్మానించిన నేపధ్యంలో చైర్మన్ తోపాటు, బోర్డు సభ్యుల నియామకం జరిగింది.

వ్యాపార రంగంలో యూసఫ్ అలీ ఇప్పటికే పేరు ప్రఖ్యాతులు గడించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో యూసఫ్ అలీకి మంచి గుర్తింపు ఉంది. కేరళలోని త్రిస్సూర్ కు చెందిన యూసఫ్ అలీ 2000 సంవత్సరంలో లులూ గ్రూప్ పేరుతో గొలుసు కట్టు హైపర్ మార్కెట్లను ఏర్పాటు చేశారు. ఈ గ్రూపు క్రింద 57వేల మంది ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు.

గల్ష్ కో ఆపరేషన్ కౌన్సిల్ దేశాలతోపాటు ఇతర ప్రాంతాలలో 210 లులూ అవుట్ లెట్లతో పాటు, 13 మాల్స్ ఉన్నాయి. మాల్స్ తోపాటు, కన్వెన్షన్ సెంటర్లు, హోటల్ వ్యాపారాల్లో లులూ గ్రూప్ దూసుకుపోతోంది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 50 మంది రిటైలర్ వ్యాపారసంస్ధలో లులూ గ్రూప్ ఒకటిగా నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ లో కేరళ లోని పనాంగడ్ సమీపంలో యూసఫ్ అలీ దంపతులు ప్రయాణిస్తున్న చాపర్ సాకేంతిక కార్యంగా ప్రమాదానికి గురైంది. అయితే అదృష్ట వశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు.

అబుధాబి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి ఛైర్మన్ గా నియమితులు కావటం పట్ల యూసఫ్ అలీ ఆనందం వ్యక్తం చేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానన్నారు. యూఏఈ, ఇండియాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషిచేస్తానని చెప్పారు.