Tamil Director Shankar: గ్రేట్ డైరెక్టర్‌ని వదలని వరస వివాదాలు!

దర్శకుడు శంకర్ మళ్ళీ భారత చిత్ర సీమలో మరో మైలురాయిని పేర్చాలని భారతీయుడు-2 తెరకెక్కిస్తున్నాడు. కానీ ఇటు కరోనా కాలం.. కమల్ హాసన్ రాజకీయ అరంగేట్రం అన్నీ కలిసి ఇండియన్-2ను కష్టాల్లోకి నెట్టేశాయి. భారతీయుడు కాకపొతే మరో సినిమా చేద్దాం ఖాళీగా ఎందుకుండాలి అనుకోని మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా ప్రకటిస్తే భారతీయుడు నిర్మాతలు డైరెక్టర్ శంకర్ మీద కేసు పెట్టారు.

Tamil Director Shankar: గ్రేట్ డైరెక్టర్‌ని వదలని వరస వివాదాలు!

Tamil Director Shankar

Tamil Director Shankar: దక్షణాది దర్శకులలో మన రాజమౌళి బాహుబలితో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంటే అంతకు ముందే తమిళ దర్శకుడు శంకర్ దక్షణాది సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. జెంటిల్ మెన్, భారతీయుడు, జీన్స్, రోబో ఇలా శంకర్ సృష్టి ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ను చూపు తిప్పుకోకుండా చేసింది. బాయ్స్, స్నేహితుడు లాంటి పరాజయాలు కూడా మూటగట్టుకున్న శంకర్ ఇప్పుడు మళ్ళీ భారత చిత్ర సీమలో మరో మైలురాయిని పేర్చాలని భారతీయుడు-2 తెరకెక్కిస్తున్నాడు. కానీ ఇటు కరోనా కాలం.. కమల్ హాసన్ రాజకీయ అరంగేట్రం అన్నీ కలిసి ఇండియన్-2ను కష్టాల్లోకి నెట్టేశాయి.

భారతీయుడు కాకపొతే మరో సినిమా చేద్దాం ఖాళీగా ఎందుకుండాలి అనుకోని మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా ప్రకటిస్తే భారతీయుడు నిర్మాతలు డైరెక్టర్ శంకర్ మీద కేసు పెట్టారు. మరోవైపు అపరిచితుడు రీమేక్ అనౌన్స్ చేస్తే అది వరస వివాదాలకు కారణమైంది. మొత్తంగా శంకర్ ఏది ప్రకటించినా అది ఏదొక ఇష్యూ అవుతూనే ఉంది. రామ్ చరణ్ తో సినిమా ప్రకటించగానే భారతీయుడు-2 నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ మద్రాస్‌ హైకోర్టులో శంకర్ మీద కేసు పెట్టింది. వందల కోట్లు ఖర్చు పెట్టించి ఈ ప్రాజెక్ట్ ఇక్కడే వదిలేసి మరో సినిమాకు ఎలా వెళతావని.. ఈ సినిమా పూర్తయ్యాకే మీరు మరో సినిమాకు వెళ్లాలని కోర్టుకెక్కింది.

Read: Ram Pothineni: ఇస్మార్ట్ హీరోతో లింగుస్వామి యాక్షన్.. తోడుగా దేవిశ్రీ!

‘ఇండియన్‌-2’ను శంకర్‌ మధ్యలో వదిలేయలేదని.. ఆ సినిమా షూటింగ్‌కు విదేశీ సాంకేతిక నిపుణులు అవసరముండగా ఇప్పుడున్న కోవిడ్‌ పరిస్థితులలో ఫారిన్‌ టెక్నీషియన్స్‌తో షూటింగ్‌ అంత ఈజీ కాదని.. ఇండియన్ సినిమాలో పెద్ద డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌ను రెండేళ్ళుగా ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ ఖాళీగా ఉంచడం కరెక్ట్‌ కాదని కోర్టుకు చెప్పుకున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు.. శంకర్ ఈ ఏడాది జూన్‌లో కూతురి పెళ్ళిచేయనున్నారు. అయిననూ కమల్‌ షూటింగ్‌కు వస్తే ‘ఇండియన్‌-2’ను పూర్తి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కోర్టుకు స్పష్టం చేసినట్లుగా తమిళ సినీ వర్గాలలో వినిపిస్తుంది.

ఇక అన్నియన్ రీమేక్ విషయానికి వస్తే.. నిర్మాత రవిచంద్రన్.. శంకర్ మధ్య లేఖల యుద్ధం నడిచింది. అన్నియన్ హక్కులు నిర్మాతగా నాకే చెందుతాయని రవిచంద్రన్ లేఖ రాస్తే.. కథ, స్క్రీన్, దర్శకత్వం శంకర్ అని వేసిన టైటిల్ మర్చిపోయావా సోదరా అంటూ శంకర్ కాస్త ఘాటుగానే రిటర్న్ లేఖ ఇచ్చారు. ఒకవైపు లైకా ప్రొడక్షన్ వర్సెస్ శంకర్.. మరోవైపు ఆస్కార్ రవిచంద్రన్ వర్సెస్ శంకర్ ఇలా వివాదాలు ఇప్పుడు తమిళ చిత్రసీమలో హాట్ టాపిక్ అవుతుంది. మరి ఈ వరస వివాదాలను శంకర్ ఎలా పరిష్కరించుకుంటాడో.. రామ్ చరణ్, రణవీర్ సింగ్ అన్నియన్ రీమేక్ ఉంటాయా అన్నది కాలమే సమాధానం చెప్పాలి!

Read: Anniyan Hindi Remake: అపరిచితుడు దర్శక, నిర్మాతల లీగల్ ఫైట్.. తగ్గేదెవరో?