Viral Video: ముస్లిం విద్యార్థిని ‘ఉగ్రవాది’తో పోల్చిన లెక్చరర్

ఓ ముస్లిం విద్యార్థిని ‘ఉగ్రవాది’ అని పేర్కొంటూ తరగతి గదిలో ఓ లెక్చరర్ తిట్టడం కలకలం రేపుతోంది. తనను ఉగ్రవాది అని అనడంతో ఆ విద్యార్థి కూడా లెక్చరర్ కు దీటుగా సమాధానం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విద్యార్థిని ఉగ్రవాదితో పోల్చిన లెక్చరర్ పై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Viral Video: ఓ ముస్లిం విద్యార్థిని ‘ఉగ్రవాది’ అని పేర్కొంటూ తరగతి గదిలో ఓ లెక్చరర్ తిట్టడం కలకలం రేపుతోంది. తనను ఉగ్రవాది అని అనడంతో ఆ విద్యార్థి కూడా లెక్చరర్ కు దీటుగా సమాధానం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విద్యార్థిని ఉగ్రవాదితో పోల్చిన లెక్చరర్ పై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలో మొదట విద్యార్థి వద్దకు వచ్చిన లెకర్చర్.. ‘నీ పేరేంటీ?’ అని విద్యార్థిని అడిగాడు. దీంతో ఆ విద్యార్థి తన పేరు చెప్పాడు. ఆ విద్యార్థి పేరు చెప్పడంతో, అతడు ముస్లిం అని లెక్చరర్ గుర్తించారు.

‘‘ఓ.. నువ్వు కసబ్ లాంటివాడివన్న మాట’’ అని అన్నారు. 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాది పేరు కసబ్ అన్న విషయం తెలిసిందే. దీంతో తనను ఉగ్రవాదితో పోల్చుతూ తన మతాన్ని కించపర్చుతున్నారని లెక్చరర్ తో విద్యార్థి గొడవపడ్డాడు. ఈ దేశంలో ముస్లిం అయినందుకు ప్రతిరోజు ఇటువంటి ఘటనలు ఎదుర్కోవడం ఓ సరదా విషయం కాదని అన్నాడు.

Kim’s Daughter: మరోసారి తన కూతురితో కలిసి సైనికుల వద్దకు కిమ్.. ఏం సందేశం ఇస్తున్నారు?

తన మతాన్ని ఎగతాళి చేయొద్దని చెప్పాడు. దీంతో ఆ విద్యార్థిని శాంతింపజేయడానికి ‘‘నువ్వు నా కుమారుడిలాంటి వాడివి’’ అని ఆ లెక్చరర్ అన్నారు. ‘‘మీ కుమారుడితో ఇలాగే మాట్లాడతారా? మీ కుమారుడిని ఉగ్రవాది పేరుతో పిలుస్తారా?’’ అని ఆ విద్యార్థి నిలదీశాడు. మరి నన్ను ఎలా పిలుస్తారు? అని ప్రశ్నించాడు. దీంతో ఆ విద్యార్థికి లెక్చరర్ క్షమాపణలు చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు