Aadhaar : అధార్ అప్ డేట్….అడ్రస్ ప్రూఫ్ లేకుండానే చేసుకోవచ్చు… మీకు తెలుసా…

ప్రస్తుతం యూఐడీఎఐ అధార్ అప్ డేట్ కోసం అడ్రస్ ఫ్రూఫ్ తో పనిలేకుండా అధార్ అడ్రస్ మార్చుకునేలా వెసులుబాటు కల్పించింది.

10TV Telugu News

Aadhaar : ఇటీవల కాలంలో అధార్ ప్రాముఖ్యత బాగా పెరిగింది. 12 అంకెల ఈ విశిష్ట గుర్తింపు కార్డును యూఐడీఏఐ సంస్ధ జారీచేస్తుంది. వ్యక్తి యొక్క సమాచారం తెలుసుకోవటం దీని ద్వారా సులభతరం. అధార్ కార్డును పొందిన వారు చాలా మంది వివిధ కారణాల వల్ల చిరునామాలు మార్చుకోవాల్సి వస్తుంది. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళటం ఈ తరహా పరిస్ధితుల నేపధ్యంలో అడ్రస్ మార్చటం తప్పనిసరి అవుతుంది. అలాంటి సందర్భాల్లో ఏదో ఒక ప్రూఫ్ కావాలని అధార్ అప్ డేట్ సెంటర్ సిబ్బంది కోరుతుంటారు. అడ్రస్ ఫ్రూఫ్ లేకపోవటంతో చాలా మంది అధార్ అప్ డేట్ చేయించుకోలేక అగచాట్లు పడుతారు.

అయితే ప్రస్తుతం యూఐడీఎఐ అధార్ అప్ డేట్ కోసం అడ్రస్ ఫ్రూఫ్ తో పనిలేకుండా అధార్ అడ్రస్ మార్చుకునేలా వెసులుబాటు కల్పించింది. అధార్ కార్డ్ లో అడ్రస్ వివరాల్లో మార్పులు చేయటాలంటే పాస్ పోర్ట్ , బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయల్సి ఉంటుంది. అలా చేస్తేనే అధార్ అడ్రస్ అప్ డేట్ అవుతుంది. అయితే ప్రస్తుతం యూఐడీఎఐ ఇచ్చిన వెసులుబాటుతో బంధువులు, ఇతర కుటుంబసభ్యుల అధార్ ప్రూఫ్ తో అడ్రస్ మార్చుకునేందుకు అవకాశం ఏర్పడింది.

మీ అధార్ కార్డులో అడ్రస్ ను సులభంగా మీరే మార్చుకోవచ్చు…దానికి మీరు అనుసరించాల్సిన విధానాన్ని పరిశీలిస్తే….

1. అధార్ లో అడ్రస్ అప్ డేట్ చేయాలనుకునే వారు https://uidai.gov.in/ వెబ్ సైట్ లింకును ఓపెన్ చేయాలి.

2.లింక్ ఓపెన్ అయ్యాక మీ కుటుంబసభ్యుల అధార్ కార్డుతో లాగిన్ అవ్వాలి.

3.అనంతరం అధార్ కార్డ్, కాంటాక్ట్ నెంబర్ తో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.

4. వెరిఫై అనంతరం మీ అధార్ కార్డ్ అడ్రస్ మార్చుకునేందుకు ఓ అప్రూవల్ లింక్ వస్తుంది.

5.వచ్చిన లింక్ పై క్లిక్ చేసి దానిని ఓ పెన్ చేసి మనం ఏఅడ్రస్ అయితే ఇవ్వదలుచుకున్నామో దానిని అందులో పొందుపరచాలి.

6. రిక్వెస్ట్ సమయంలో మీ కాంటాక్ట్ నెంబర్ ను ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అనంతరం మీ అధార్ అడ్రస్ మార్చుకునేందుకు 28 అంకెల సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి.

7. 28 అంకెల ఎస్ఆర్ ఎన్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత అడ్రస్ మార్చుకునేలా రిక్వెస్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇదంతా పూర్తయిన అనంతరం ఓ పిన్ నెంబర్ మీ చిరునామాకు పోస్ట్ ద్వారా మీరు మార్చుకున్న అడ్రస్ కు వస్తుంది.

8. ఆ సీక్రెట్ కోడ్ ను ఎంటర్ చేసిన అధార్ అడ్రస్ రివ్యూ ఆఫ్షన్ పై క్లిక్ చేయాలి. గడువు సమయం ముగిసిన తరువాత మీ అధార్ లో అడ్రస్ అప్ డేట్ ప్రక్రియ పూర్తవుతుంది.

10TV Telugu News