Gopichand : ‘ఆరడుగుల బుల్లెట్‌’ దిగేది ఎప్పుడంటే..

మ్యాచో హీరో గోపీచంద్ - న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘ఆరడుగుల బుల్లెట్‌’..

Gopichand : ‘ఆరడుగుల బుల్లెట్‌’ దిగేది ఎప్పుడంటే..

Aaradugula Bullet Movie Ready To Release

Gopichand: మ్యాచో హీరో గోపీచంద్ – న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘ఆరడుగుల బుల్లెట్‌’.. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించిన ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. థియేటర్స్‌ రీ ఓపెన్‌ కాగానే ‘ఆరడుగుల బుల్లెట్‌’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

డైరెక్టర్ మారిపోయారు..
ఈ సినిమాని ముందుగా ఓ తమిళ్ డైరెక్టర్ కొంత పార్ట్ షూట్ చేశారు. తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల అతణ్ణి తప్పించి, స్టార్ అండ్ సీనియర్ డైరెక్టర్, యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు అయిన బి.గోపాల్‌ను తీసుకున్నారు.

స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ కథ..
న్యూస్ రీడర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, తర్వాత నటుడిగా మారి, ఆ తర్వాత రైటర్‌గా టర్న్ అయ్యారు వక్కంతం వంశీ. జూనియర్ ఎన్టీఆర్ ‘అశోక్’, ‘ఊసరవెల్లి’, ‘టెంపర్’ రవితేజ ‘కిక్’ వంటి సినిమాలకు సక్సెస్‌ఫుల్ కథలు రాసి, స్టార్ రైటర్‌గా ఎదిగి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్న వంశీ.. మ్యాచో హీరో గోపిచంద్ ఇమేజ్‌కి తగ్గట్టు హై వోల్టేజ్ యాక్షన్ స్టోరీ అందించారు.

బ్లాక్‌బస్టర్ అండ్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన బి.గోపాల్..
‘అసెంబ్లీ రౌడీ’, ‘బొబ్బిలి రాజా’, ‘లారీ డ్రైవర్’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’, ‘ఇంద్ర’ వంటి బ్లాక్‌బస్టర్, ఇండస్ట్రీ హిట్స్ తీసిన బి.గోపాల్ చివరిగా రామ్ పోతినేని హీరోగా ‘మస్కా’ సినిమా చేశారు. 2009 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ యూత్ ఎంటర్‌టైనర్‌గా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. మధ్యలో పలుసార్లు బాలకృష్ణతో సినిమా అని వార్తలొచ్చాయి కానీ అవేవీ తెరరూపం దాల్చలేదు. కొంత గ్యాప్ తర్వాత బి. గోపాల్ మెగాఫోన్ పట్టిన ఈ ‘ఆరడుగుల బుల్లెట్’ మూవీని తన మార్క్ మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించారు.

ఐదేళ్లు దాటినా రిలీజ్ ఆలస్యం..
2017లో విడుదలవాల్సిన సినిమా ఇది.. డైరెక్టర్ మారడం, ఆర్టిస్టులు, టెక్నీషియన్ల డేట్స్ ప్రాబ్లమ్.. రీ షూట్స్.. అన్నీ కుదిరి, గుమ్మడికాయ కొట్టాక కూడా రిలీజ్ చెయ్యలేని పరిస్థితి. నిర్మాత, పలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడుదల చేయలేకపోయారు. ఇన్నాళ్ల తర్వాత వరల్డ్ వైడ్‌గా ఓన్ రిలీజ్ చేస్తున్నారు.

‘మెలోడి బ్రహ్మ’ మణిశర్మ సంగీతం..
తెలుగులో స్టార్ హీరోలందరితో పని చేసి, ఆయా సినిమాల సక్సెస్‌లో మెయిన్ పిల్లర్‌గా నిలిచారు మణిశర్మ. గోపిచంద్ ‘యజ్ఞం’, ‘లక్ష్యం’, ‘శౌర్యం’ వంటి హిట్ సినిమాలకు అద్భుతమైన సాంగ్స్, అదిరిపోయే ఆర్ఆర్ ఇచ్చారు మెలోడి బ్రహ్మ. కొంత గ్యాప్ తర్వాత ఆయన సంగీతమందించిన గోపిచంద్ సినిమా ఇదే కావడం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా విడుదల..
ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్మాత తాండ్ర రమేష్ ఓన్ రిలీజ్‌ చేస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను స్టార్ట్‌ చేసి విడుదల తేదీ గురించి పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. గోపిచంద్, న‌య‌న‌తార కాంబినేష‌న్‌, బి. గోపాల్ డైరెక్ష‌న్‌, వ‌క్కంతం వంశీ క‌థ‌, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ కానున్నాయ‌ని నిర్మాత రమేష్ అన్నారు.