Aashritha V Olety : భారత్ తొలి మహిళా ఫ్లైట్ టెస్ట్‌ ఇంజినీర్‌ గా చరిత్ర క్రియేట్ చేసిన ఆశ్రిత

Aashritha V Olety : భారత్ తొలి మహిళా ఫ్లైట్ టెస్ట్‌ ఇంజినీర్‌ గా చరిత్ర క్రియేట్ చేసిన ఆశ్రిత

India 1st Woman Flight Test Engineer (2)

Aashritha V Olety is India 1st woman flight test engineer : భారతీయ ఎయిర్‌ఫోర్స్‌లో ఇకనుంచి ఏ విమానం కొనాలన్నా..పనులు మొదలు పెట్టాలన్నా..విమానాన్ని క్షుణ్ణంగా పరీక్షించి దానికి OK చేయాల్సిన బాధ్యత అంతా ఆమెదే. ఆమెనే భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్‌ టెస్ట్‌ ఇంజినీర్‌ ఆశ్రిత వి. ఓలేటి. భారత త్రివిధ దళాలలో మహిళల శాతం తక్కువే. కానీ ఇటీవల కాలంలో పరిస్థితులు మారాయి. దీంట్లో భాగంగా మహిళలు లింగ అడ్డంకులు అధిగమించి ప్రతిభాపాటవాలను కనబరుస్తున్నారు. భారత త్రివిధ దళాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. మూడు సైనిక విభాగాలల్లో తమ స్థానాన్ని నిరూపించుకుంటున్నారు. సుస్థిరపరుచుకుంటున్నారు. దీంట్లో భాగంగానే 1973 నుంచి ఎయిర్‌ఫోర్స్‌ నిర్వహిస్తున్న ఫ్లయిట్‌ టెస్ట్‌ ఇంజినీర్‌ పరీక్షను కేవలం 275 మంది పాసవ్వగా వారిలో తొలి మహిళగా ఆశ్రిత చరిత్ర సృష్టించింది.

ఆశ్రిత జన్మించింది కర్ణాటక రాష్ట్రంలోని కొల్లెగల్‌. బెంగళూరులో ఇంజినీరింగ్‌ చేసింది. 2014లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ లో చేరి స్క్వాడ్రన్‌ లీడర్‌ అయ్యింది. ఇవేవీ పెద్ద విషయాలు..విజయాలు కాకపోవచ్చు. కానీ అసలైన చరిత్రకు నాంది పలికింది అశ్రిత. అదే ‘ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ టెస్ట్‌ పైలెట్‌ స్కూల్‌’ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘ఫ్లయిట్‌ టెస్ట్‌ కోర్స్‌’ లో పాస్ కావటం. 43వ బ్యాచ్ లో అశ్రిత చక్కటి ప్రతిభను కనబరిచటమే సాధారణమైనది కాదు.

ప్రపంచంలో కేవలం ఏడు మాత్రమే ఉండే ఇలాంటి స్కూల్స్‌లో ఈ కోర్సులో ఉత్తీర్ణత సాధించటమే కాదు..భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్‌ టెస్ట్‌ ఇంజినీర్‌ కావడం అంటే మాటలు కాదు. ఇదో పెద్ద ఎచీవ్ మెంట్. ఐ.ఎ.ఎఫ్‌ ఈ విషయాన్ని తన అఫీషియల్‌ ట్విటర్‌ లో ప్రకటించి ఆశ్రితకు అభినందనలు తెలిపింది. అంటే అశ్రిత సాధించిన విషయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు.

కాగా..ఇండియన్‌ ఆర్మీలో మహిళల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఆర్మీలో ప్రస్తుతం 6,807 మంది మహిళా ఆఫీసర్లు పని చేస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్‌లో 1607 మంది ఉండగా..అదే నేవీలో వీరి సంఖ్య చాలా తక్కువగానే ఉంది. కేవలం 704మంది మాత్రమే. త్రివిధ దళాలలో పురుషులతో పోలిస్తే మహిళలు చాలా తక్కువమందే ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో మారిన పరిస్థితుల్లో జెండర్‌ అడ్డంకులు అధిగమించి స్త్రీలు త్రివిధ దళాలలో తమ స్థానాన్ని నిరూపించుకుంటున్నారు. ఈ సంఖ్య మరింతగా పెరగాలని..భారత త్రివిధ దళాలలో మహిళలు గెలుపు సంతకం చేయాలని ఆశిద్దాం..