‘బచ్చన్ పాండే’ లో ‘బుక్కా రెడ్డి’

‘బచ్చన్ పాండే’ లో ‘బుక్కా రెడ్డి’

Abhimanyu Singh: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కృతి సనన్ జంటగా నటిస్తున్న మూవీ‘బచ్చన్ పాండే’.. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకకు రిపబ్లిక్ డే కానుకగా 2022 జనవరి 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైనర్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తుండగా.. ఫర్హాద్ సామ్జీ డైరెక్ట్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ డిఫరెంట్ గెటప్‌లో సరికొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్నారు.

https://10tv.in/akshay-kumars-bachchan-pandey-releasing-on-26-jan-2022/

తాజాగా ఈ సినిమాలో అక్షయ్‌కి ప్రతినాయకుడిగా ‘రక్తచరిత్ర’లో ‘బుక్కా రెడ్డి’ గా ప్రేక్షకులను భయపెట్టిన అభిమన్యు సింగ్‌ను ఎంపిక చేశారు. తెలుగులో పలు సినిమాల్లో విలన్ క్యారెక్టర్లో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న అభిమన్యు సింగ్ ఈ సినిమాలో వెరైటీ విలన్‌గా కనిపించబోతున్నారు.