Over Sleeping : రాజస్థాన్‌లో అభినవ కుంభకర్ణుడు.. నిద్రపోతే ఇక లేవడు!

ఇలా నిద్రపోయేవాళ్ళగురించి పురాణాల్లో కుంభకర్ణుడు గురించి మాత్రమే తెలుసుకుని ఉంటాం..365రోజులు నిద్రపోయేవాడని విన్నాం. అయితే ప్రస్తుతం రాజస్ధాన్ వాసి గురించి తెలికొని అంతా షాకవుతున్నారు.

10TV Telugu News

Over Sleeping : మనిషి ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలంటే నిద్రపోవటం చాలా అవసరం. ఒక రాత్రి నిద్రలేకపోతే మరుసటి రోజు నిసత్తువ, ఏదో కోల్పోయినట్లు ఉంటుంది. సాధారణంగా మనిషి రోజుకు 7గంటలనుండి 9గంటలు నిద్రపోతాడు.. ఇంకా మహా అయితే 10గంటలు నిద్రపోయే వారు కూడా ఉంటారు. అయితే రాజస్ధాన్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా రోజులతరబడి నిద్రపోతున్నాడు. ఇలా నిద్రపోయేవాళ్ళగురించి పురాణాల్లో కుంభకర్ణుడు గురించి మాత్రమే తెలుసుకుని ఉంటాం..365రోజులు నిద్రపోయేవాడని విన్నాం. అయితే ప్రస్తుతం రాజస్ధాన్ వాసి గురించి తెలికొని అంతా షాకవుతున్నారు. ఇక వివరాల్లోకి వెళితే

రాజస్ధాన్ లోని నాగౌర్ జిల్లా భద్వా గ్రామానికి చెందిన 42 సంవత్సరాల పూర్ఖారామ్ ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాడు. అదేంటంటే అనుకోకుండా అతను నిద్రలోకి జారుకుంటున్నాడు. అలా నిద్రపోయిన వ్యక్తి తిరిగి మేల్కొనాలంటే చాలా కష్టం. అతడిని మేల్కొల్పేందుకు కుటుంబంసభ్యులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఈ వ్యాధి వచ్చిన తొలినాళ్ళల్లో ఒకసారి నిద్రలోకి జారుకుంటే మెలుకువ వచ్చేందుకు వారంరోజులు పట్టేది.

రానురాను అతని సమస్య పెరుగుతుండటంతో కుటుంబసభ్యులు పూర్ఖారామ్ ను వైద్యుని వద్దకు తీసుకువెళ్ళారు. అయితే వైద్యులు మాత్రం అతని సమస్యకు పరిష్కారం మాత్రం కనుగొనలేకపోయారు. అతిగా నిద్రపోవటం కూడా ఓ వ్యాధి.. దీనిని హైపర్సోమ్నియాగా అంటారు. పూర్ఖారామ్ ప్రస్తుతం ఈ హైపర్సోమ్నియా వ్యాధితో బాధపడుతున్నాడు. దీని కారణంగానే అతను రోజుల తరబడి నిద్రపోతూ ఉన్నాడు. అతను మేల్కోవాలని మనస్సులో అనుకుని నిద్రకు ఉపక్రమించినప్పటికీ అతని శరీరం నిద్రలేచేందుకు సహకరించదు.

గత 23సంత్సరాలుగా పుర్ఖారామ్ ఇలా రోజుల తరబడి నిద్రపోయే వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఇతని వయస్సు 42 సంవత్సరాలు. ఒక్కోసారి అతను నిద్రపోతే తిరిగి నిద్రలేవాలంటే 25 రోజులు పడుతుంది. ప్రపంచంలో అత్యంత కొద్ది మంది ఈ అరుదైన వ్యాధి భారిన పడుతుంటారు. ఇలాంటి వారికి సరైన చికిత్స అవసరం..చికిత్స సత్ఫలితాలు ఇస్తాయా లేదా అన్నది వైద్యులు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

10TV Telugu News