రాందేవ్ కు చిక్కులు..మహారాష్ర్ట వార్నింగ్

  • Published By: madhu ,Published On : June 25, 2020 / 06:24 AM IST
రాందేవ్ కు చిక్కులు..మహారాష్ర్ట వార్నింగ్

కరోనా కట్టడికి ఆయుర్వేద ఔషధం కరోనిల్ కిట్ అంటూ అట్టహాసంగా ప్రకటించిన  పతంజలి అధినేత, యోగా గురు రాందేవ్ ఇపుడు చట్టపరమైన  ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. కోవిడ్-19 నివారణకు కరోనిల్ వందశాతం పనిచేస్తుందని ప్రకటించిన రాందేవ్, బాలకృష్ణపై  ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని… ముజఫర్‌పూర్‌లోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో తమన్నా హష్మి ఫిర్యాదు చేశారు.

ప్రాణాంతక మహమ్మారికి మందు అంటూ లక్షలాది మంది ప్రజలను తప్పు దారి పట్టించి, వారి జీవితాలను  ప్రమాదంలోకి నెట్టివేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను జూన్ 30 వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు… పతంజలి  వివాదాస్పద కరోనిల్ మందుకు సంబంధించి  ఆ సంస్థ వాదనలో వాస్తవాలు, శాస్రీయ అధ్యయనంపై తమకు ఎలాంటి సమాచారం లేదని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 

ఇదిలా ఉంటే…కొరెనిల్ డ్రగ్ ను మహారాష్ట్రలో అనుమతించబోమని రాష్ట్ర హోం మంత్రి అనీల్ దేశ్ ముఖ్ స్పష్టం చేశారు. కృత్రిమ మందుల అమ్మకాలను అనుమతించమని రాందేవ్‌ బాబాను హెచ్చరించారు. కొరోనిల్‌ ఔషధం పనితీరును అథ్యయనం చేసేందుకు పూర్తిస్ధాయిలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారా అనేది నిమ్స్‌, జైపూర్‌ నిగ్గుతేల్చాలని అనిల్‌ దేశ్‌ముఖ్‌ గురువారం ట్వీట్‌ చేశారు. శాస్రీయ అధ్యయనంపై తమకు ఎలాంటి సమాచారం లేదని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకటనను ఆయన స్వాగతించారు. 

 

Read:  కేంద్ర నిర్ణయాలను అమ్మాయిలతో పోలుస్తూ..’ఒక్క అబ్బాయి కోసం ఐదుగురు అమ్మాయిలు’ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు