రూ.30లక్షల డబ్బు, 10 తులాల బంగారం ఎక్కడిది, తహసీల్దార్ సుజాతపై ప్రశ్నల వర్షం

నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో షేక్‌పేట తహసీల్దార్‌ సుజాతను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. రెండోరోజు(ఆదివారం జూన్ 7,2020) విచారణలో భాగంగా దాదాపు

  • Published By: naveen ,Published On : June 7, 2020 / 12:18 PM IST
రూ.30లక్షల డబ్బు, 10 తులాల బంగారం ఎక్కడిది, తహసీల్దార్ సుజాతపై ప్రశ్నల వర్షం

నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో షేక్‌పేట తహసీల్దార్‌ సుజాతను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. రెండోరోజు(ఆదివారం జూన్ 7,2020) విచారణలో భాగంగా దాదాపు

నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో షేక్‌పేట తహసీల్దార్‌ సుజాతను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. రెండోరోజు(ఆదివారం జూన్ 7,2020) విచారణలో భాగంగా దాదాపు ఆరు గంటలకు పైగా ఎంక్వైరీ కొనసాగుతోంది. ఆర్‌ఐ నాగార్జునరెడ్డి, బంజారాహిల్స్ ఎస్సై రవీందర్‌ నాయక్‌ను వేర్వేరుగా విచారిస్తున్నారు అధికారులు. తహసీల్దార్ ఇంట్లో లభించిన రూ.30లక్షల నగదు, పది తులాల బంగారు ఆభరణాలపైనే అధికారులు ప్రశ్నించగా.. డబ్బు తన సొంతమని ఎమ్మార్వో సుజాత చెప్పినట్లు తెలుస్తోంది. డబ్బు, నగలకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని ఏసీబీ అధికారులు కోరగా.. అందుకు ఆమె మౌనం వహించినట్లు తెలుస్తోంది. 

భూవివాదం పరిష్కారానికి రూ.30లక్షల లంచం:
నిన్న(జూన్ 6,2020) రాత్రి 12 గంటల వరకు తహసీల్దార్‌ సుజాతను ఏసీబీ అధికారులు విచారించారు. బంజారాహిల్స్‌లో ఓ స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు రూ.30 లక్షలు డిమాండ్ చేసిన షేక్‌పేట్‌ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ నాగార్జున … రూ.15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఈ వ్యవహారంలో ఏమైనా ప్రమేయం ఉందేమోనని తహసీల్దార్ సుజాత ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్‌ సుజాత ఇంట్లో రూ.30 లక్షలు నగదు, బంగారు ఆభరణాలు లభించాయి. ఇదే వివాదంలో బంజారాహిల్స్‌ ఎస్‌ఐ రవీందర్‌ నాయక్‌ 1.5 లక్షలు తీసుకున్నట్టు తేలింది. దీంతో ఏసీబీ అధికారులు తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకొని ఆర్‌ఐ, ఎస్‌ఐలను అరెస్ట్‌ చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లో 4 వేల 865 చదరపు అడుగుల స్థలాన్ని తన తండ్రి 1969లో కొనుగోలు చేశారని, ఆ భూమిని సర్వే చేసి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలంటూ సయ్యద్‌ అబ్దుల్‌ ఖలీద్‌ షేక్‌పేట్‌ తహ
సీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.

రూ.40కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ:
ఇది ప్రభుత్వ భూమి అని, సర్వే చేయడం కుదరదని తహసీల్దార్‌ సుజాత తేల్చడంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఇవ్వగా, రూ.40 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి సయ్యద్‌ ఖలీద్‌ ప్రయత్నిస్తున్నారంటూ తహసిల్దార్‌ ఫిర్యాదు చేశారు. దీంతో బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ భూ వివాదంలో రాజీ కుదిర్చేందుకు నాగార్జున రెడ్డి ద్వారా తహసీల్దార్‌ 30 లక్షలు లంచం డిమాండ్‌ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. అధికారుల సూచన మేరకు సయ్యద్‌ ఖలీద్‌ షేక్‌పేట్‌ తహసిల్దార్‌ కార్యాలయ సమీపంలో ఆర్‌ఐకి 15 లక్షలు ఇచ్చారు. అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు ఆర్‌ఐని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదే వివాదంలో రెవెన్యూ అధికారులతో రాజీ కుదిర్చి కేసులు లేకుండా చేస్తానంటూ బంజారాహిల్స్‌ ఎస్‌ఐ రవీందర్‌ 3 లక్షలు డిమాండ్‌ చేసి, 1.5 లక్షలు తీసుకున్నారు. మరో 3 లక్షలు డిమాండ్‌ చేస్తున్నట్టు బాధితుడు ఏసీబీకి సమాచారమిచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు ఆర్‌ఐ నాగార్జునరెడ్డి, ఎస్‌ఐ రవీందర్‌ను అరెస్ట్‌ చేసి, ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.