Ex DSP Jagan : నా భర్త జగన్ అవినీతి చేయలేదు, కక్ష పెట్టుకుని ఏసీబీ దాడులు చేయించారు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్‌ఎండీఏ విజిలెన్స్‌ మాజీ డీఎస్పీ జగన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. సుదీర్ఘంగా 38 గంటల పాటు అధికారులు సోదాలు నిర్వహించారు.

Ex DSP Jagan : నా భర్త జగన్ అవినీతి చేయలేదు, కక్ష పెట్టుకుని ఏసీబీ దాడులు చేయించారు

Ex Dsp Jagan

Ex DSP Jagan : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్‌ఎండీఏ విజిలెన్స్‌ మాజీ డీఎస్పీ జగన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. సుదీర్ఘంగా 38 గంటల పాటు అధికారులు సోదాలు నిర్వహించారు. హెచ్‌ఎండీఏలో పని చేస్తున్న సమయంలో అక్రమాలు చేసినట్లు జగన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్‌తో పాటు అతని బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. బోడుప్పల్‌, కొర్రెముల, జోడిమెట్లలో జగన్‌ వెంచర్‌ వేసినట్లు.. బినామీ పేరుతో పెట్రోల్‌ బంకు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

Whole Grain Diet : చిరుధాన్యపు ఆహారంతో బరువు తగ్గొచ్చు తెలుసా?..

కాగా, తమ ఇంట్లో ఏబీసీ దాడులపై మాజీ డీఎస్పీ జగన్ భార్య అడిషనల్ ఎస్పీ లక్ష్మి స్పందించారు. తమ ఇంట్లో ఏసీబీ దాడులు దురుద్దేశ పూర్వకంగా జరిగాయని ఆమె ఆరోపించారు. అప్పట్లో ఏసీబీ అధికారిగా పని చేసిన అచ్యుత్ రావు తమపై పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని దాడులు చేయించారని చెప్పారు. తన భర్త జగన్ అవినీతికి పాల్పడ లేదన్నారు. ఇటీవల తమ బంధువుల వివాహం జరగడంతో బంధువుల బంగారం తమ ఇంట్లో ఉందన్నారు. హెచ్ఎండీఏలో డీఎస్పీగా పని చేస్తుండగా కోటేశ్వర్ రావు కు ఫేవర్ చేయాలని అచ్యుత్ రావు అడిగారని, దానికి నిరాకరించడంతో జగన్ పై కక్ష పెట్టుకుని దాడులు చేయించారని చెప్పారు. కొర్రెములలో తమకు ఎలాంటి ల్యాండ్ లేదని తేల్చి చెప్పారు. తమ ఇంట్లో కేవలం రూ.80వేలు మాత్రమే దొరికాయని, తమకు ఎలాంటి డబ్బు ఆశ లేదన్నారామె. ఏసీబీ అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని లక్ష్మి చెప్పారు.

WhatsApp Group Admins : వాట్సాప్ గ్రూపు అడ్మిన్లకు న్యూ పవర్..? అందరి మెసేజ్‌లు డిలీట్ చేయొచ్చు!

HMDA విజిలెన్స్ విభాగంలో డీఎస్పీగా పని చేసిన జగన్ ను ఏసీబీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. 2019లో జగన్ ను హెచ్ఎండీఏ విజిలెన్స్ విభాగం నుండి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. తాజాగా ఓపెన్ ప్లాట్ విషయంలో కోటేశ్వర్ రావు అనే వ్యక్తి నుండి రూ. 4 లక్షలు తీసుకున్నారని జగన్ పై ఆరోపణలున్నాయి.

హైదరాబాద్ హబ్సిగూడలోని జగన్ ఇంటితో పాటు ఆయన సమీప బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు. జగన్ ఇంట్లో సుమారు కిలో బంగారంతో పాటు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.