డార్లింగ్‌కి దిష్టి తగిలింది.. ఫ్యాన్స్ శాంతి పూజలు..

డార్లింగ్‌కి దిష్టి తగిలింది.. ఫ్యాన్స్ శాంతి పూజలు..

Prabhas Movie: రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రాలతో నేషనల్ లెవల్లో క్రేజ్ దక్కించుకున్నారు. అప్పటినుండి అతని సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే భారీగా తెరకెక్కుతన్నాయి. మన టాలీవుడ్ రెబల్ స్టార్ కాస్తా పాన్ ఇండియా.. ఇంకా చెప్పాలంటే పాన్ వరల్డ్ స్టార్‌గా ఎదిగిపోయారు. ‘రాధే శ్యామ్’ రిలీజ్‌కి రెడీ చేస్తున్న డార్లింగ్ చేతిలో ‘సలార్’, ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ సినిమాలున్నాయి.

కాగా ప్రభాస్ సినిమాలకు సంబంధించి వరుస ప్రమాదాలు జరుగడంతో అభిమానులు, పరిశ్రమ వర్గాల వారు ఆందోళన చెందుతున్నారు. అనుకోని ఈ సంఘటనలతో ‘సలార్’, ‘ఆదపురుష్’ టీమ్ సభ్యులు కూడా కాస్త కంగారుపడ్డారు.

https://10tv.in/rebel-star-prabhas-adipurush-aarambh/

భారీ సెట్ బుగ్గిపాలు..
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఒకే రోజు రెండు ప్రమాదాలు జరిగాయి. డార్లింగ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆదిపురుష్’ మంగళవారం (ఫిబ్రవరి 2) ప్రారంభమైంది. అదే రోజు ఈ సినిమా కోసం ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో వేసిన సెట్‌లో అగ్నిప్రమాదం సంభంవించిది. ఈ దుర్ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరుగలేదు.

Adipurush

రోడ్డు ప్రమాదం..
ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న ‘సలార్’ షూటింగ్ ఈ మధ్యే రామగుండంలో స్టార్ట్ అయ్యింది. మంగళవారం రాత్రి ‘సలార్’ యూనిట్ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురయ్యింది. గోదావరిఖనిలోని శ్రీనగర్ వద్ద జరిగిన ఈ ఘటనలో పలువురు యూనిట్ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి.

https://10tv.in/salaar-team-met-with-an-accident-near-godavarikhani/

టీం కి బెదిరింపులు..
తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో షూటింగ్ చేస్తున్నామని ‘సలార్’ టీం తెలిపిన తర్వాత నక్సల్స్ నుంచి హెచ్చరికలు వచ్చాయట. ‘సలార్’ టీం, ప్రభాస్‌కు బెదిరింపులు రావడంతోనే ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారట.

ముందుగానే ప్యాకప్..
భారీ భద్రత కల్పించినప్పటికీ వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని అక్కడి వారు కూడా చెప్పడంతో ‘సలార్’ టీం స్పీడ్‌గా షూటింగ్‌ చేస్తున్నారు. ఫిబ్రవరి 12 వరకు అనుకున్న ఈ షెడ్యూల్ అంతకంటే ముందే ప్యాకప్ అయ్యేలా కనిపిస్తోంది.

https://10tv.in/prabhas-salaar-team-gets-threats-from-naxals/

దిష్టి పోయింది..
దీంతో ‘ఆదిపురుష్’ ఫస్ట్ డే నే ఇలా అయ్యిందేంటి.. అంతలోనే ‘సలార్’ టీమ్ ప్రయాణిస్తున్న వెహికల్ ప్రమాదానికి గురవడమేంటి.. సింగరేణిలో షూటింగ్ జరుపుతున్న ‘సలార్’ యూనిట్‌కి బెదిరింపులు రావడం ఏంటి అని నిరుత్సాహ పడుతున్న నెటిజన్లకు ‘దిష్టి పోయింది అనుకుందాం బ్రదర్’ అంటూ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ జవాబిచ్చాడు. ఇంక కొందరు ప్రభాస్ వీరాభిమానులు ‘డార్లింగ్‌కి దిష్టి తగిలింది’ అంటూ శాంతి పూజలు చేయించడానికి రెడీ అవుతున్నారు.

https://10tv.in/a-major-fire-broke-out-on-the-sets-of-adipurush/