Facebook Women : ఫేస్‌బుక్‌కు అల్లంత దూరాన అతివ‌లు..ఎందుకో తెలుసా?

భారతీయ మహిళలను తమ భద్రత, గోప్యతపై భయం వెంటాడుతోందని... అందుకే ఫేస్‌బుక్‌కు దూరంగా ఉంటున్నారని తేలింది. రెండేళ్ల క్రితం ఇంటర్నెట్‌ వాడకందారుల్లో 62శాతం మంది పురుషులు ఉంటే... గతేడాది 75శాతానికి పెరిగింది. ఇది ఇంటర్నెట్‌ వాడకందారుల్లో లింగ అసమానత్వం స్పష్టంగా కనిపిస్తోందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

Facebook Women : ఫేస్‌బుక్‌కు అల్లంత దూరాన అతివ‌లు..ఎందుకో తెలుసా?

Facebook (1)

Facebook accounts : కొన్నేళ్లుగా అత్యంత పాపులారిటీ పొందిన ఫేస్‌బుక్‌కు భారీ షాక్‌ తగిలింది. 2021 చివరి త్రైమాసికంలో చురుగ్గా ఫేస్‌బుక్‌ వాడే ఖాతాదారులు తగ్గిపోయారు. ఇందుకు మొబైల్‌ డేటా రేట్లు పెరగడమే కారణం అని ఫిబ్రవరిలో ఫేస్‌బుక్‌ తెలిపింది. కానీ ఫేస్‌బుక్‌ అంతర్గతంగా రూపొందించిన నివేదిక సంస్థ యాజమాన్యానికి షాక్‌ ఇచ్చింది. భారత్‌లో ఫేస్‌బుక్‌ ఖాతా రెగ్యులర్‌గా ఓపెన్‌ చేయడానికి మహిళలు వెనుకాడుతున్నారని ఈ నివేదిక తేల్చి చెప్పింది.

భారతీయ మహిళలను తమ భద్రత, గోప్యతపై భయం వెంటాడుతోందని… అందుకే ఫేస్‌బుక్‌కు దూరంగా ఉంటున్నారని తేలింది. రెండేళ్ల క్రితం ఇంటర్నెట్‌ వాడకందారుల్లో 62శాతం మంది పురుషులు ఉంటే… గతేడాది 75శాతానికి పెరిగింది. ఇది ఇంటర్నెట్‌ వాడకందారుల్లో లింగ అసమానత్వం స్పష్టంగా కనిపిస్తోందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

Central Govt : డిజిటల్‌ మాధ్యమాల ద్వారా నకిలీ వార్తల వ్యాప్తిపై కేంద్రం కఠిన చర్యలు

చాలా కుటుంబాలు తమ ఇంటి మహిళలు ఫేస్‌బుక్‌లోకి రావడానికి అనుమతించడం లేదని మెటావర్స్‌ రూపొందించిన ఈ అంతర్గత నివేదిక తెలిపింది. దీనికితోడు సగటున 20 నుంచి 30శాతం మహిళలు, వారానికోసారి తమ ఫేస్‌బుక్‌ వాల్‌పై అశ్లీల దృశ్యాలు కనిపిస్తున్నాయని ఫిర్యాదు చేశారని పేర్కొంది. భారత్‌లో ఓ మహిళ చీర కట్టుకుని ముఖానికి ముసుగేసుకున్న ఫొటో అప్‌లోడ్‌ చేస్తే సుమారు 367మంది ఆగంతకుల నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు వచ్చాయని తెలిపింది.

చాలా బాగున్నావ్‌, ఎక్కడుంటావ్‌ అని కామెంట్లు కూడా చేశారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రొఫైల్‌ లాక్‌ ఆపరేషన్‌ అమల్లోకి వచ్చాక ఇలాంటి కామెంట్లు తగ్గాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌ ఖాతాదారులుగా ఉన్న మహిళలందరి నుంచి ఇదే ఫిర్యాదు రావడంతో సంస్థ యాజమాన్యం ప్రొఫైల్‌ లాక్‌ ఆపరేషన్‌ తీసుకొచ్చింది. అయినా మహిళల్లో అభద్రతా భావం నెలకొంది.