Corona Virus: మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది.. కానీ కరోనాకు..

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడం పాజిటివిటీ కలిగించే అంశమే కానీ ప్రజలలో కరోనా భయం మాత్రం వీడడం లేదు. మహమ్మారి బారినపడి కుటుంబాలకు కుటుంబాలే చిన్నాభిన్నమైపోతున్నాయి. వివిధ రంగాలలో నిపుణులతో పాటు ఉన్నత విద్యావంతులు సైతం మహమ్మారిని ఎదుర్కోడంలో విఫలమైపోతున్నారు.

Corona Virus: మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది.. కానీ కరోనాకు..

Achieved Three Government Jobs But Died With Corona

Corona Virus: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడం పాజిటివిటీ కలిగించే అంశమే కానీ ప్రజలలో కరోనా భయం మాత్రం వీడడం లేదు. మహమ్మారి బారినపడి కుటుంబాలకు కుటుంబాలే చిన్నాభిన్నమైపోతున్నాయి. వివిధ రంగాలలో నిపుణులతో పాటు ఉన్నత విద్యావంతులు సైతం మహమ్మారిని ఎదుర్కోడంలో విఫలమైపోతున్నారు. అట్టెంప్ట్ చేసిన తొలి ప్రయత్నంలోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఓ యువతి కరోనాకు బలైపోయింది. కామారెడ్డి జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి గ్రామానికి చెందిన విజయ(26).. మొదటి ప్రయత్నంలోనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి, గ్రూప్ 4 ఉద్యోగాల్లో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగాలు సాధించారు. మల్లుపల్లిలో పంచాయితీ కార్యదర్శిగా పనిచేయగా.. ప్రస్తుతం తడ్వాయి తహసీల్ధార్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే బుధవారం జ్వరం రావడంతో అనుమానంతో కరోనా పరీక్ష చేయించుకోగా.. రిపోర్టు పాజిటివ్ గా వచ్చింది.

స్వల్ప లక్షణాలే కావడంతో హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటుండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ఆస్పత్రిలో చేరారు. అయితే, అప్పటికే మహమ్మారి ముదిరిపోవడంతో చికిత్స పొందుతూ ఆమె శనివారం అర్థరాత్రి మరణించారు. జీవితంలో విజయం సాధించిన యువతి ఇలా మహమ్మారికి బలైపోవడం ఆమె సొంత గ్రామంతో పాటు ఆమె స్నేహితులు పనిచేసే చోట విషాద ఛాయలు అలుకుమున్నాయి. ఇక, స్వయం కృషితో ఎదిగిన కూతురు ఇలా దూరమవడంతో ఆమె తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.