Tarun : ‘పుష్ప’ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న తరుణ్..!

విలన్ రోల్‌లో కనిపించనున్న టాలెంటెడ్ మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ కోసం తరుణ్‌ను రంగంలోకి దింపుతున్నారని సమాచారం..

Tarun : ‘పుష్ప’ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న తరుణ్..!

Actor Tarun Is Playing An Important Role In Pushpa

Tarun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయిక.. పాపులర్ మలయాళం యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు..

‘పుష్ప’ బ్యాలెన్స్ షూటింగ్‌కి కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. అయితే లేటెస్ట్‌గా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆడియెన్స్‌ను ఆకట్టుని, ఆ తర్వాత హీరోగా యూత్‌లో మంచి ఫాలోయింగ్‌తో పాటు లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న తరుణ్ ‘పుష్ప’ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట..

Pushpa : అల్లు అర్జున్ ఆల్ టైమ్ రికార్డ్..!

ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం సుకుమార్ తరుణ్‌ని ఫిక్స్ చేశారని అంటున్నారు.. ఈ న్యూస్ నిజమే అయితే కనుక తరుణ్‌కి ‘పుష్ప’ సాలిడ్ కమ్‌‌ బ్యాక్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇదిలా ఉంటే తరుణ్ ఈ మూవీలో యాక్ట్ చెయ్యడం లేదు.. విలన్ రోల్‌లో కనిపించనున్న టాలెంటెడ్ మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ కోసం తరుణ్‌ను రంగంలోకి దింపుతున్నారని సమాచారం.. ఫాహద్ క్యారెక్టర్‌కి తెలుగులో తరుణ్‌ చేత డబ్బింగ్ చెప్పించాలనుకుంటున్నారని, ఇప్పటికే వాయిస్ టెస్ట్ చెయ్యగా పర్ఫెక్ట్‌గా సూట్ అయిందని వార్తలు వస్తున్నాయి.. త్వరలోనే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారని తెలుస్తుంది.