Prabhas 21 : ప్రభాస్ – నాగ్ అశ్విన్ మూవీ.. షాకింగ్ రెమ్యునరేషన్..

యంగ్ రెబల్ స్టార్ ఓ సినిమా చేస్తున్నాడంటే.. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన న్యూస్ ఎలాంటిదైనా ట్రెండింగ్‌గా మారుతోంది..

Prabhas 21 : ప్రభాస్ – నాగ్ అశ్విన్ మూవీ.. షాకింగ్ రెమ్యునరేషన్..

Actors Shocking Remuneration For Prabhas And Nag Aswin Movie

Prabhas 21: ఇప్పట్లో పట్టాలెక్కేందుకు రెడీ కాకపోయినా.. ప్రభాస్ – నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ రోజుకో రకంగా వార్తల్లో నిలుస్తోంది. రీసెంట్‌గా ఈ మూవీ బడ్డెట్ బజ్ ఇంట్రెస్టింగ్‌గా మారితే.. అంతకన్నా ఇంట్రెస్టింగ్‌గా స్టార్స్ రెమ్యునరేషన్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.. యంగ్ రెబల్ స్టార్ ఓ సినిమా చేస్తున్నాడంటే.. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన న్యూస్ ఎలాంటిదైనా ట్రెండింగ్‌గా మారుతోంది. ‘రాధే శ్యామ్’, ‘సలార్’, ‘ఆదిపురుష్’ తర్వాత నాగ్ అశ్విన్ – ప్రభాస్ కాంబో సినిమా పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. నిజానికి కరోనా సెకండ్ వేవ్ లేకపోతే వచ్చే నెలలోనే ఈ క్రేజీ మూవీ సెట్స్ పైకెళ్లేది.

ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకముందే ఈ ప్రాజెక్ట్ ప్రతిరోజూ హెడ్ లైన్స్‌లో నిలుస్తోంది. ఇప్పుడలాగే ఈ మూవీ బడ్జెట్ ఓ రకంగా షాకిస్తుంటే.. ఇందులో నటించబోయే స్టార్స్ పారితోషికాల వార్త మరోలా షాకిస్తోంది. ప్రభాస్ మూవీని నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్‌లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. టైమ్ మెషిన్‌లో 2050 సంవత్సరానికి తీసుకెళ్లి మూడో ప్రపంచయుద్ధాన్ని చూపించనున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం వైజయంతీ మూవీస్ ఏకంగా 500కోట్ల రూపాయలకు పైగానే ఖర్చుపెట్టనున్నట్టు సమాచారం.

ఇందులో మేజర్ బడ్జెట్ స్టార్స్ రెమ్యునరేషన్‌కే ఎగిరిపోతుందని అంటున్నారు. ప్రభాస్ ఏకంగా 100 కోట్ల రూపాయలు అందుకుంటున్నారని చెప్తున్నారు. మరోవైపు దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్ వంటి 10 మంది బాలీవుడ్ స్టార్స్ కోసం కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారట మేకర్స్. మొత్తంగా చూసుకుంటే అనుకున్న బడ్జెట్‌లో దాదాపు 200 కోట్ల వరకు స్టార్స్ రెమ్యునరేషన్‌కే వెళ్లిపోతుందని టాక్..

పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్ట్ స్క్రిప్క్ వర్క్ పక్కాగా పూర్తి చేస్తున్నారు నాగ్ అశ్విన్. తొందరపడి సెట్స్ పైకెళ్లకుండా ప్రీ-ప్రొడక్షన్ పూర్తయ్యాకే ముహూర్తం పెట్టుకోవాలని డిసైడయ్యారు. ఈలోపు ప్రభాస్ కూడా ‘సలార్’, ‘ఆదిపురుష్’ పూర్తి చేస్తారు. తర్వాత ఈ సైఫై ప్రాజెక్ట్ కోసం బల్క్ డేట్స్ ఇచ్చేందుకు రెడీఅవుతున్నారు. అటు దీపికా ఇప్పటికే ఇచ్చిన డేట్స్ వేస్టవడంతో కొత్త కాల్షీట్స్ అడ్జెస్ట్ చేసే పనిలో ఉంది. అమితాబ్ కూడా వేరే మూవీస్‌తో క్లాషెస్ రాకుండా జాగ్రత్తపడుతున్నారు. చూస్తుంటే… తీసుకుంటున్న పెద్ద మొత్తానికి గట్టి న్యాయం చేసేందుకు డిసైడయినట్టు కనిపిస్తున్నారు నాగ్ అశ్విన్ స్టార్స్..