Hansika Motwani : ఇండియన్ స్క్రీన్‌పై హన్సిక సరికొత్త ప్రయోగం ‘105 మినిట్స్’..

రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో హన్సిక ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘105 మినిట్స్’.. ఇండియన్ స్క్రీన్‌పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్‌తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనంతో చేస్తున్న సింగిల్ షాట్ చిత్రం ‘105 మినిట్స్’..

Hansika Motwani : ఇండియన్ స్క్రీన్‌పై హన్సిక సరికొత్త ప్రయోగం ‘105 మినిట్స్’..

Hansika Motwani

Hansika Motwani: రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో హన్సిక ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘105 మినిట్స్’.. ఇండియన్ స్క్రీన్‌పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్‌తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనంతో చేస్తున్న సింగిల్ షాట్ చిత్రం ‘105 మినిట్స్’..

‘సింగిల్ షాట్’, ‘సింగిల్ క్యారెక్టర్’, ‘రీల్ టైం & రియల్ టైం’ ఈ చిత్రానికి హైలైట్స్ అని మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రంలో హన్సికని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కనబడబోతోందని చిత్ర దర్శకుడు రాజు దుస్సా తెలిపారు. ఈ చిత్రం తన కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచి పోతుంది అని చిత్ర కథానాయిక హన్సిక అన్నారు.

ఈ సినిమా మేకింగ్ తనకు ఒక ఛాలెంజ్ అని సినిమాటోగ్రాఫర్ దుర్గా కిషోర్ అన్నారు. ఇలాంటి చిత్రాన్ని నిర్మించడం నాకు చాలా సంతోషంగా వుందని, చిత్ర నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని చిత్ర నిర్మాత బొమ్మక్ శివ వివరించారు..