దిష్టిబొమ్మలుగా హీరోయిన్స్.. ఐడియా అదిరిందిగా..

దిష్టిబొమ్మలుగా హీరోయిన్స్.. ఐడియా అదిరిందిగా..

Kajal -Tamannaah: అవసరం మనిషిని ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించేలా చేస్తుంది. ఉపయోగించుకునే విధానం తెలియాలే కానీ ఈ ప్రపంచంలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు.. ఈ మాటల్ని నిజం చేస్తూ తన ఐడియాతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు ఓ రైతన్న.. తన మెదడుకి పదును పెట్టి టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, తమన్నా భాటియాలను దిష్టి బొమ్మలుగా మార్చేశాడు..

వివరాళ్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేటలోని చంద్రమౌళి అనే రైతు తనకున్న రెండకరాల్లో మిర్చి సాగు చేస్తున్నాడు.. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటకు ఎప్పుడూ ఏదో ఒక తెగులు సోకి ప్రతిఫలం దక్కక నష్టపోతున్నాడు.. దీంతో తన పొలానికి నర దిష్టి తగిలిందని ఫిక్స్ అయ్యాడు.. బాధలో నుండి మెరుపులాంటి ఐడియా వచ్చింది..

కట్ చేస్తే.. తన పొలంలో దిష్టి బొమ్మలకు బదులుగా హాట్ బ్యూటీ కాజల్, మిల్కీ బ్యూటీ తమన్నాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు.. అలా అయితే హీరోయిన్లను చూసిన వారి దృష్టి తన పంటపై పడదు, దిష్టి తగలదు అనేది చంద్రమౌళి చురుకైన ఆలోచన అన్నమాట.. ఈ విషయం తెలిసినవాళ్లు ఐడియా అదిరింది గురూ అంటూ సదరు రైతన్నను అభినందిస్తున్నారు..