Mehreen : ఎంగేజ్‌మెంట్‌తోనే ఎండ్ కార్డ్.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న మెహ్రీన్..

తాను ఎంతో హర్ట్ అవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఫ్రెండ్స్ అండ్ వెల్‌విషర్స్ మంచిమనసుతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది మెహ్రీన్..

Mehreen : ఎంగేజ్‌మెంట్‌తోనే ఎండ్ కార్డ్.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న మెహ్రీన్..

Actress Mehreen Pirzada Announces Her Engagement Breaks With Bhavya Bishnoi

Mehreen: మెహ్రీన్ కౌర్ పిర్జాదా.. నాని ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘మహానుభావుడు’, ‘C/O సూర్య’, ‘జవాన్’, ‘కవచం’, ‘చాణక్య’, ‘ఎంతమంచి వాడవురా’, ‘అశ్వద్థామ’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ఎఫ్ 2’ తో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ పంజాబీ బ్యూటీ ఇప్పుడు ‘ఎఫ్ 3’ లో నటిస్తోంది.

Mehreen
ఈ సినిమాతో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నా. ఎందుకంటే త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నా అంటూ ఈ విషయాన్ని చాలా ఆనందంగా అందరితోనూ షేర్ చేసుకుంది మెహ్రీన్. కట్ చేస్తే.. ఏమైందో ఏమో ఇప్పుడు తమ రిలేషన్‌కి ఎంగేజ్‌మెంట్‌తోనే ఎండ్ కార్డ్ పడిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Mehreen

వాస్తవానికి హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ కుటుంబానికి కోడలిగా వెళ్లాల్సింది మెహ్రీన్. కాంగ్రెస్ నేత, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్ కొడుకు భవ్యా బిష్ణోయ్‌తో మార్చ్ 12న రాజస్థాన్‌లోని జైపూర్‌గలా అలియా ఫోర్ట్ విల్లాలో వీరి ఆమె నిశ్చితార్థం కూడా జరిగింది.

F3 Movie : మెల్లగా మళ్ళీ నవ్వులు మొదలు..

ఇప్పుడు తన నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నానని, ఇకపై భవ్యా బిష్ణోయ్‌తో కానీ, బిష్ణోయ్‌ ఫ్యామిలీతో కానీ ఎలాంటి రిలేషన్ ఉండదని రాసుకొచ్చింది. తాను ఎంతో హర్ట్ అవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఫ్రెండ్స్ అండ్ వెల్‌విషర్స్ మంచిమనసుతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది మెహ్రీన్.