యువ నటి ఆత్మహత్య, షాక్ లో ఇండస్ట్రీ, లాక్ డౌన్ ఎఫెక్టేనా..

హిందీ యువ నటి ప్రేక్షా మెహతా ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు 25 సంవత్సరాలు. ప్రస్తుతం లాక్‌డౌన్‌

  • Published By: naveen ,Published On : May 27, 2020 / 07:30 AM IST
యువ నటి ఆత్మహత్య, షాక్ లో ఇండస్ట్రీ, లాక్ డౌన్ ఎఫెక్టేనా..

హిందీ యువ నటి ప్రేక్షా మెహతా ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు 25 సంవత్సరాలు. ప్రస్తుతం లాక్‌డౌన్‌

హిందీ యువ నటి ప్రేక్షా మెహతా ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు 25 సంవత్సరాలు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ లేకపోవడంతో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న మెహతా, తన గదిలో ఉరి వేసుకుంది. సోమవారం (మే 25న) రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకుంది. మెహతా బుల్లి తెర నటిగా గుర్తింపు పొందింది. ‘క్రైం పెట్రోల్’, ‘లాల్ ఇష్క్’, ‘మేరి దుర్గ’ వంటి టీవీ షోలలో నటించింది. అలాగే, అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ‘ప్యాడ్ మ్యాన్’ సినిమాలోనూ ఒక పాత్ర పోషించింది. మెహతా ఆత్మహత్య వార్త సినీ, టీవీ పరిశ్రమను షాక్ కి గురి చేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటి ఇలా అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకోవడంపై సహచరులు, అభిమానులు విచారం వ్యక్తం చేశారు.

ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది:
మెహతా సోమవారం రాత్రి ఉరివేసుకున్నప్పటికీ కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం చూశారు. మంగళవారం ఉదయం గదిలో నుంచి మెహతా ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో కంగారు పడిన తండ్రి గదిలోకి వెళ్లగా చూడగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవగా కనిపించింది. వెంటనే ఆమెను కిందకి దించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న హీరానగర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘బుల్లితెర నటి ప్రేక్షా మెహతా లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి ఇండోర్‌లోనే కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలు గురించి దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే వివరాలను వెల్లడిస్తాం’ అని పోలీసులు తెలిపారు. 

లాక్ డౌన్ లో పని లేకపోవడంతో ఆత్మహత్య?
కాగా, ప్రేక్షా మెహతా సోమవారం రాత్రి పెట్టిన ఓ ఇన్‌స్టా పోస్ట్‌ చర్చనీయాంశమైంది. ”కన్న కలలు చనిపోవడమే మన జీవితంలో చెత్త విషయం’ అంటూ ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ లేకపోవడంతో డిప్రెషన్‌కు లోనై మెహతా ఆత్మహత్య చేసుకుందా అని సందేహిస్తున్నారు. మెహతాకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. లాక్‌డౌన్ ముందు వరకు ముంబైలో ఉన్న ప్రేక్షా.. కరోనా వైరస్ విజృంభణతో తన సొంత నగరానికి వచ్చేసింది. ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. మొత్తంగా మెహతా ఎందుకు చనిపోయిందనేది సస్పెన్స్‌గా మారింది. అన్ని కోణాల్లో దర్యాఫ్తు జరుపుతున్నామని త్వరలోనే నటి ఆత్మహత్యకు కారణాలు వెల్లడిస్తామని పోలీసుల చెప్పారు.

Read: సల్మాన్ ముద్దుపై కో-స్టార్ భాగ్యశ్రీ ఇప్పుడేం ఏమన్నారంటే?