Sai Pallavi: పెళ్లి కూతురు కాబోతున్న సాయి పల్లవి?

ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే స్కిన్ షో అవసరం లేదని నిరూపించిన హీరోయిన్ సాయిపల్లవి. మలయాళం ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి ఇప్పుడు దక్షణాది అన్ని బాషలలో స్టార్ హీరోయిన్. హీరోల పాత్రలకు ధీటుగా పాత్రలను ఎంచుకుంటూ..

Sai Pallavi: పెళ్లి కూతురు కాబోతున్న సాయి పల్లవి?

Sai Pallavi (Image:Instagram)

Sai Pallavi: ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే స్కిన్ షో అవసరం లేదని నిరూపించిన హీరోయిన్ సాయిపల్లవి. మలయాళం ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి ఇప్పుడు దక్షణాది అన్ని బాషలలో స్టార్ హీరోయిన్. హీరోల పాత్రలకు ధీటుగా పాత్రలను ఎంచుకుంటూ.. యంగ్ హీరోల సినిమాకు ప్లస్ గా మారుతున్న సాయిపల్లవిని టాలీవుడ్ స్టార్స్ కూడా తెగ పొగిడేస్తారు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా హై రేంజ్ లో ఉంటుంది. ఈ మధ్యనే లేడీ పవర్ స్టార్ అన్న ట్యాగ్ లైన్ కూడా యాడ్ అయింది.

Sai Pallavi : వ్యవసాయ కూలీగా మారిన స్టార్ హీరోయిన్

ఇంత ఛరిస్మా ఉన్నా సరే సాయిపల్లవి చేతిలో ప్రస్తుతం ఒక్కటి.. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. ఇంత క్రేజ్ ఉంచుకొని డబ్బు సంపాదించే అవకాశాలు పుశ్కలంగా ఉన్నా.. న్యాచురల్ బ్యూటీ ఏం ఆలోచిస్తుంది.. ఎందుకు ఆలోచిస్తోంది? సాయి పల్లవి తెలుగులో నటించిన చివరి సినిమా విరాటపర్వం ఒక్కటే. విడుదలకి సిద్ధంగా ఉన్నా ఈ సినిమా తర్వాత మరే సినిమాకి కమిట్ అవలేదు. అంటే త్వరలో పెళ్లి పీటలెక్కపోతుందని అందుకే కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదని సోషల్ మీడియాలో ఓ టాక్ నడుస్తుంది. ముఖ్యంగా తమిళ సినీ ఇండస్ట్రీలో సాయి పల్లవి పెళ్లి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Sai Pallavi: సైలెంట్‌గా సాయిపల్లవి.. బ్రేక్ ఇచ్చిందా.. బ్రేక్ వచ్చిందా?

అయితే.. ఆమె స్నేహితులు మాత్రం పెళ్లి ప్రస్తావనను కొట్టి పారేస్తున్నారు. సినిమాల ఎంపిక, స్క్రిప్ట్ విషయంలో పల్లవి పక్కాగా ఉండే ఈ హీరోయిన్.. మంచి కథ తన దగ్గరికి వచ్చే వరకు వెయిట్‌ చేస్తోందని చెబుతున్నారు. పెళ్లి విషయంలో కూడా ఈ మధ్య మీడియా అడిగితే అప్పుడే నాకు పెళ్లేంటి జస్ట్ 29 మాత్రమే ఏజ్ అంటూ సాయి పల్లవి చేసిన కామెంట్స్ కూడా గుర్తు చేస్తున్నారు. అయితే.. సినీ సెలబ్రిటీలు చాలా మంది ఇలాగే లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ సైలెంట్ గా పెళ్లి తంతు ముగించిన వాళ్ళు ఉండడంతో ఏమో అసలు నిజమేంటో అంటూ అనుమానిస్తున్నారు.