Taapsee : పెళ్లెప్పుడు..? అంటే అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిందిగా..!

మీరెప్పుడు పెళ్లి పీటలెక్కుతారు..? అని అడిగితే.. సూటిగా సుత్తి లేకుండా అర్థమయ్యేలా అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది.. టాలెంటెండ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ తాప్సీ పన్ను..

Taapsee : పెళ్లెప్పుడు..? అంటే అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిందిగా..!

Taapsee

Taapsee: ఈ కరోనా టైంలో చాలా మంది నటీనటులు పెళ్లిళ్లు చేసేసుకున్నారు.. మరి, మీరెప్పుడు పెళ్లి పీటలెక్కుతారు..? అని అడిగితే.. సూటిగా సుత్తి లేకుండా అర్థమయ్యేలా అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది.. టాలెంటెండ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ తాప్సీ పన్ను..

‘ఝమ్మందినాదం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తాప్సీ.. ఆ తర్వాత తెలుగులో మరికొన్ని సినిమాలు చేసింది.. అయితే బాలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్ మూవీస్‌తో నటిగా పాపులారిటీ తెచ్చుకుంది. ‘చష్మీ బద్దూర్’ తో ఎంట్రీ ఇచ్చి, అక్షయ్ కుమార్ ‘బేబి’ మూవీలో చేసినా ‘పింక్’ తోనే బాగా గుర్తింపు వచ్చింది. ‘రన్నింగ్ షాదీ’, ‘నామ్ షబానా’, ‘గేమ్ ఓవర్’, ‘శాండ్ కీ ఆంఖ్’, ‘తప్పడ్’ సినిమాలు తాప్సీ కెరీర్‌ని నిలబెట్టాయి.

ఈ సొట్టబుగ్గల సుందరి గతకొద్ది కాలంగా డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథ్యూస్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది. త్వరలోనే వీళ్ల పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే మాట తాప్సీని అడిగితే.. ‘ప్రస్తుతం సంవత్సరానికి ఆరు సినిమాలు చేస్తున్నాను. ఆ నెంబర్ రెండు లేదా మూడుకి తగ్గినప్పుడు చేసుకుంటా’ అని చెప్పింది.