Honey : టీలో తేనె కలుపుకుంటున్నారా! ఏం జరుగుతుందో తెలుసా?

అయితే ఎన్నో ఔషదగుణాలు కలిగిన తేనెను టీలో కలుపుకుని తీపికి ప్రత్యామ్నాయంగా చాలా మంది ఉపయోగిస్తుంటారు. ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తేనెను టీ లో కలుపుకుని తాగితే శరీరం స్లో పాయిజన్ గా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Honey : టీలో తేనె కలుపుకుంటున్నారా! ఏం జరుగుతుందో తెలుసా?

Honey

Honey : తేనెలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా తేనె తీసుకోవటం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. తేనెలో ఫ్రూట్ గ్లూకోజ్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫేట్, సోడియం, క్లోరిన్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యానికి హానికరమైన బ్యాక్టీరియాల నుండి మనల్ని రక్షించటంలో సహాయపడతాయి.యాంటిసెప్టిక్, యాంటీబయాటెక్, విటమిన్ బి 1, విటమిన్ బి 6 కూడా సమృద్ధిగా ఉంటాయి.

డయాబెటిక్‌ వ్యాధిగ్రస్తులకు తీపికి ప్రత్నామ్నాయంగా తేనెను ఉపయోగిస్తారు. దగ్గు నుంచి ఉపశమనాన్నిస్తుంది. ప్రేగులను శుభ్రపరుస్తుంది. కాలిన గాయాలను నయం చేస్తుంది. చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పరకడుపున వేడినీళ్లలో తేనె కలుపుకుని తాగితే కొలెస్ట్రాల్‌ను కరిగించి బరువును తగ్గిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది.

అయితే ఎన్నో ఔషదగుణాలు కలిగిన తేనెను టీలో కలుపుకుని తీపికి ప్రత్యామ్నాయంగా చాలా మంది ఉపయోగిస్తుంటారు. ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తేనెను టీ లో కలుపుకుని తాగితే శరీరం స్లో పాయిజన్ గా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే తేనెలోని పోషకాలు కాస్త హానికరమైన విషాలుగా మారతాయి. క్రమేపి శరీరంలో అనేక వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఏర్పాడుతుంది.

తేనె అధిక ఫ్రక్టోజ్ కంటెంట్ కలిగి ఉంటుంది. ప్రేగులులో శోషణను నిరోధించటంలో దోహదం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో జీర్ణశయ సమస్యలను తెచ్చిపెట్టేందుకు అవకాశం ఉంటుంది. తేనేను ఎక్కువగా వాడటం వల్ల హైపర్ టెన్షన్, గుండె సమస్యలు, వికారం, చెమట పట్టటం వంటి సమస్యలకు తలెత్తే అవకాశం ఉంటుంది.

సాధ్యమైనంత వరకు తేనెటీగల నుండి నేరుగా సహజ తేనెను తీసి విక్రయించేవారి నుంచి కొని, వేడి చేయకుండా తింటే తేనెలోని సహజ పోషకాలు నేరుగా శరీరానికి అందుతాయి. మార్కెట్లలో లభించే అన్నిరకాల తేనెలు విపరీతమైన ఉష్ణోగ్రతల్లో వేడి చేసి ప్యాక్ చేయబడి ఉంటాయి. అలాంటి తేనెను తిరిగి వేడిగా ఉండే టీలలో కలుపుకోవటం వల్ల హానికారంగా మారే అవకాశాలు ఉన్నాయి.