Harish Rao : హ‌రీశ్ రావుకు వైద్య, ఆరోగ్య శాఖ అప్పగింత

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వైద్యఆరోగ్యశాఖ అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (నవంబర్ 9)న ఉత్తర్వులు జారీచేసింది.

Harish Rao : హ‌రీశ్ రావుకు వైద్య, ఆరోగ్య శాఖ అప్పగింత

Harish Rao (1)

Harish Rao : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వైద్యఆరోగ్యశాఖ అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (నవంబర్ 9)న ఉత్తర్వులు జారీచేసింది. దీనికి సంబంధించి ఫై‌ల్‌పై గవర్నర్ తమిళిసై సంతకం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు హ‌రీశ్ రావు ఆర్థిక శాఖ‌ను మాత్ర‌మే ప‌ర్య‌వేక్షించేవారు.

ఇక నుంచి రెండు శాఖ‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తార‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌లో పేర్కొంది. ప్ర‌స్తుతం ఆరోగ్య శాఖ మాత్రం సీఎం కేసీఆర్ వ‌ద్దే ఉంది. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఆరోగ్య శాఖ‌పై హ‌రీశ్‌రావు స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ వచ్చారు. రాష్ట్రంలో కొవిడ్ నివార‌ణ చ‌ర్య‌ల‌పై హ‌రీశ్‌రావు ఎప్ప‌టిక‌ప్పుడు సీఎస్ సోమేశ్ కుమార్‌, ఆరోగ్య శాఖ అధికారుల‌తో స‌మీక్షించి, సూచ‌న‌లు చేశారు.

అంతకుమందు కేసీఆర్ కరోనా బారినపడటం తర్వాత బిజీగా వుండటంతో హరీశ్ రావే వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించిన పలు సమీక్షలను నిర్వహించారు. ఆ తరువాత ఆయనకు ఈ శాఖ అప్పగించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా ప్రచారం కూడా జరిగింది. మరోవైపు త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయా శాఖలకు సంబంధించి మార్పులు చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also : Allu Arjun : అల్లు అర్జున్‌కు టీఎస్ ఆర్టీసీ లీగ‌ల్ నోటీసులు