presidential candidate: సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోస్టర్లు

ప‌శ్చిమ బెంగాల్‌లోని ఆలిపూర్‌ద‌వార్‌లో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి వ్య‌తిరేకంగా కొంద‌రు పోస్ట‌ర్లు అంటించారు. 'గిరిజ‌నుల వ్య‌తిరేకి మ‌మ‌తా బెన‌ర్జీ' అని రాసుకొచ్చారు.

presidential candidate: సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోస్టర్లు

Posters

presidential candidate: ప‌శ్చిమ బెంగాల్‌లోని ఆలిపూర్‌ద‌వార్‌లో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి వ్య‌తిరేకంగా కొంద‌రు పోస్ట‌ర్లు అంటించారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌కు ఎన్డీఏ త‌మ అభ్య‌ర్థిగా గిరిజ‌న నాయ‌కురాలు ద్రౌప‌ది ముర్మును పోటీలోకి దింపిన విష‌యం తెలిసిందే. అయితే, మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం య‌శ్వంత్ సిన్హాను విప‌క్ష పార్టీల అభ్య‌ర్థిగా పోటీకి దింపారు. ఈ నేప‌థ్యంలో ఆలిపూర్‌ద‌వార్‌లో కొన్ని చోట్ల బీజేపీ, ఆదివాసీలు మ‌మ‌తా బెన‌ర్జీకి వ్య‌తిరేకంగా పోస్ట‌ర్లు ఏర్పాటు చేసి విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘గిరిజ‌నుల వ్య‌తిరేకి మ‌మ‌తా బెన‌ర్జీ’ అని రాసుకొచ్చారు.

Maharashtra: ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్ల మార్పు.. ‘మ‌హా’ కేబినెట్ కీల‌క‌ నిర్ణయాలు

రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఓ గిరిజ‌న మ‌హిళను అభ్య‌ర్థిగా నిల‌ప‌డం త‌మ‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని బీజేపీ మాజీ ఎంపీ ద‌శ‌ర‌థ్ అన్నారు. ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ఈ విధంగా త‌మ‌కు గౌర‌వం ఇచ్చార‌ని ఆయ‌న చెప్పారు. బీజేపీ గిరిజ‌న మ‌హిళ‌ను రాష్ట్రప‌తి చేయాల‌ని భావిస్తుంటే మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం ఈ విష‌యంపై రాజ‌కీయాలు చేస్తున్నార‌ని గిరిజనులు విమ‌ర్శించారు. ఇటీవ‌ల గిరిజ‌న మ‌హిళ‌ల‌తో క‌లిసి మ‌మ‌తా బెన‌ర్జీ నృత్యం చేసిన ఫొటోను కూడా వారు పోస్ట‌ర్ల‌లో చూపారు. నిజంగా గిరిజ‌నుల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని మ‌మ‌తా బెన‌ర్జీ భావిస్తే ద్రౌప‌ది ముర్ముకు ఎందుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌ర‌ని నిల‌దీశారు.